పిల్లలపై టీకా ట్రయల్స్.. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో..

Delhi high court refuses to stay Covaxin clinical trial on children aged 2-18. కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతిపై స్టే విధించాల‌ని సంజీవ్‌ కుమార్‌ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్‌ దాఖలు చేశారు.

By Medi Samrat  Published on  19 May 2021 11:19 AM GMT
covaxin clinical trails on children

కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే వీలైనంత త్వరగా పిల్లలకు కూడా వ్యాక్సిన్లు తీసుకుని రావాలని భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ల విషయంలో పిల్లలపై కూడా ట్రయల్స్ నిర్వహించాలని భావిస్తూ ఉన్నారు. దేశంలో చిన్నారుల‌పై క‌రోనా వ్యాక్సిన్ 'కొవాగ్జిన్' స‌మ‌ర్థంగా ప‌నిచేస్తుందా? లేదా అన్నది తెలుసుకోడానికి ప్ర‌యోగాలు చేయ‌నున్నారు. ఇప్ప‌టికే 2 నుంచి 18 ఏళ్ల వారిపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమ‌తి కూడా ఇచ్చింది.

అయితే, ఆ అనుమతిపై స్టే విధించాల‌ని సంజీవ్‌ కుమార్‌ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్‌ దాఖలు చేశారు. ట్రయల్స్‌లో పాల్గొనాల్సిన పిల్లలు తమకు తాము వాలంటీర్లుగా రిజిస్టర్‌ చేసుకుంటున్నారని ఆయ‌న‌ వ్యాజ్యంలో పేర్కొన్నారు. మైనర్లయిన పిల్లలకు వ్యాక్సిన్ ప్రయోగాల వల్ల తలెత్తే పరిణామాలపై అవగాహన ఉండదని, ఈ విషయంలో వారి తల్లిదండ్రుల అంగీకారం కూడా ఆమోదయోగ్యం కాదని అభ్యంత‌రాలు తెలిపారు. ట్ర‌య‌ల్స్‌పై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో పిల్లలపై ప్రయోగాలు చేసుకోడానికి అనుమతులు లభించినట్లే..! ఈ ప్ర‌యోగాల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు డీసీజీఐకు నోటీసులు జారీ చేసింది.




Next Story