క్లైమేట్ యాక్టివిస్ట్ దిశ రవికి బెయిల్ మంజూరు అయ్యింది. టూల్కిట్ వ్యవహారంలో అరెస్టయిన దిశ రవికి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు రూ.లక్ష పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఖలిస్థాన్ అనుకూల గ్రూప్.. పోయెటిక్ జస్టిస్ ఫౌండేషన్ ద్వారా దిశ రవి దేశ వ్యతిరేక ప్రచారానికి పాల్పడిందని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. దీంతో దిశ రవితో పాటు నిఖితా జాకబ్, శంతను ములుక్‌లపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే శంతను, నిఖితలకు కోర్టు ముందే ట్రాన్సిట్ బెయిల్ లభించింది.
దిశా కస్టడీని మరో నాలుగురోజులపాటు పొడిగించాలని పోలీసులు పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు దిశ 24 గంటలు పొడిగిస్తూ కోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది. జనవరి 26న ఢిల్లీలో జరిగిన ఘటనలకు, దిశారవికి సంబంధం ఉందనడానికి ఏమైనా ఆధారాలున్నాయా..? కోర్టు పోలీసులను ప్రశ్నించింది. సమర్పించిన ఆధారాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు ఉదయం దిశతో బాటు శంతను ములుక్, నిఖితా జాకబ్ లను కూడా పోలీసులు విచారించారు. విచారణ సందర్భంగా దిశ.. శంతను, నిఖితాపై ఆరోపణలు చేసిందని, అందువల్ల ఆమె బెయిలును నిరాకరించాలని పోలీసులు కోర్టును కోరారు.