మనీష్ సిసోడియాకు మళ్లీ షాక్.. సీబీఐ కేసులో జ్యుడీషియల్ కస్టడీ జూన్ 2 వరకు పొడిగింపు

Delhi Court extends Manish Sisodia’s judicial custody till June 2. లిక్క‌ర్ పాల‌సీ కేసుకు సంబంధించి సీబీఐ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ

By Medi Samrat  Published on  12 May 2023 2:42 PM IST
మనీష్ సిసోడియాకు మళ్లీ షాక్.. సీబీఐ కేసులో జ్యుడీషియల్ కస్టడీ జూన్ 2 వరకు పొడిగింపు

లిక్క‌ర్ పాల‌సీ కేసుకు సంబంధించి సీబీఐ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు జూన్ 2 వరకు పొడిగించింది. అంతకుముందు.. మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై తీర్పును కోర్టు గురువారం రిజర్వ్ చేసింది. బెయిల్ పిటిషన్‌ను పరిష్కరించే వరకు రోజు విడిచి రోజు మధ్యాహ్నం 3-4 గంటల మధ్య సిసోడియా, ఆయ‌న‌ భార్య మధ్య వర్చువల్ మీటింగ్ జరిగేలా చూడాలని జస్టిస్ దినేష్ కుమార్ శర్మ సంబంధిత జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. జైలు నిబంధనల ప్రకారమే వర్చువల్ మీటింగ్ జరుగుతుందని కోర్టు స్పష్టం చేసింది. సిసోడియా ప్రస్తుతం సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా ఈడీ కేసులో కూడా కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించింది.

మనీష్ సిసోడియా భార్య సీమా సిసోడియా చాలా కాలంగా మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధితో బాధపడుతున్నారు. మనీష్ సిసోడియా జైలుకు, ఆయ‌న‌ కుమారుడు చదువుల కోసం విదేశాలకు వెళ్లినప్పటి నుంచి ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. దీంతో ఆమె ఒత్తిడికి గురవుతున్నారు. మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ వ్యాధితో బాధపడే రోగికి శరీరంపై మెదడు నియంత్రణ తగ్గిపోతుందని ఆమెకు చికిత్స అందిస్తున్న అపోలో వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమెలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యాధి కారణంగా ఆమె శరీరంపై సగం కార్యాచరణ ప్రభావితమవుతుంది. దీంతో నడవడానికి, కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు తెలిపారు.


Next Story