క్రికెట్‌ ఆడుతూ కరెంట్‌ షాక్‌తో బాలుడి దుర్మరణం

ఔటర్ ఢిల్లీలోని రన్‌హోలా ప్రాంతంలోని క్రికెట్ గ్రౌండ్‌లో విద్యుదాఘాతానికి గురై 13 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

By అంజి  Published on  11 Aug 2024 3:00 PM IST
Delhi , electrocuted , cricket ground

క్రికెట్‌ ఆడుతూ కరెంట్‌ షాక్‌తో బాలుడి దుర్మరణం

ఔటర్ ఢిల్లీలోని రన్‌హోలా ప్రాంతంలోని క్రికెట్ గ్రౌండ్‌లో విద్యుదాఘాతానికి గురై 13 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మధ్యాహ్నం 1:30 గంటలకు పిసిఆర్ కాల్ వచ్చిందని, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ (డిడియు) ఆసుపత్రి నుండి సమాచారం అందిందని, విద్యుత్ వైర్‌ను మోస్తున్న ఇనుప స్తంభానికి తాకడంతో బాలుడు విద్యుదాఘాతానికి గురయ్యాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. కోట్లా విహార్‌ ఫేజ్‌ 2లోని క్రికెట్‌ గ్రౌండ్‌లో బాలుడు బంతిని తీసుకోవడానికి వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.

అతన్ని పిసిఆర్ వ్యాన్ ద్వారా డిడియు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు ప్రకటించారు. సెక్షన్ 106(1) భారతీయ న్యాయ సంహిత కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని కొన్ని ప్రాంతాలలో వరుసగా రెండవ రోజు కూడా భారీ నుండి మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో శనివారం భారీ వరద కారణంగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి.

మూడు వారాల క్రితం, ఢిల్లీలో 26 ఏళ్ల యుపిఎస్‌సి ఆశావాహి విద్యుదాఘాతంతో మరణించారు. ఆ వ్యక్తిని నీలేష్ రాయ్‌గా గుర్తించారు. ఈ ఘటన పటేల్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.

Next Story