శుక్రవారం ఆస్ట్రియాలోని వియన్నా నుండి న్యూఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్య కారణంగా దుబాయ్‌కు మళ్లించబడిందని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. "అక్టోబర్ 9న వియన్నా నుండి న్యూఢిల్లీకి నడుస్తున్న AI-154 విమానం సాంకేతిక సమస్య కారణంగా దుబాయ్‌కు మళ్లించబడింది. విమానం దుబాయ్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. అవసరమైన తనిఖీలు జరిగాయి. ఆలస్యం గురించి అందరూ ప్రయాణీకులకు తెలియజేయబడింది.రిఫ్రెష్‌మెంట్లు అందించబడ్డాయి. విమానం 08:45 గంటలకు ISTకి బయలుదేరింది" అని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జూన్ 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలి మంటల్లో కాలిపోయింది. ఈ దుర్ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణిస్తుండగా.. ఒకే ఒక్క ప్రయాణికుడు ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.