యాక్సిడెంట్‌కు ముందు పార్టీ చేసుకుని.. మితిమీరిన వేగంతో..

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఘోరమైన కారు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

By Kalasani Durgapraveen  Published on  15 Nov 2024 2:58 PM IST
యాక్సిడెంట్‌కు ముందు పార్టీ చేసుకుని.. మితిమీరిన వేగంతో..

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఘోరమైన కారు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. కళాశాల విద్యార్థుల బృందం పార్టీ చేసుకుందని, ట్రక్కును వెనుక నుండి ఢీకొట్టే ముందు భారీ వేగంతో నడిపారని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విద్యార్థులు మితిమీరిన వేగంతో వాహనాన్ని నడిపినట్లు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలో తేలింది.

మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థుల ఇన్నోవా వాహనం ట్రక్కును వెనుక నుండి ఢీకొనడానికి ముందు BMW కారుతో రేసింగ్‌లో ఉన్నట్లు భావిస్తూ ఉన్నారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్నవారిలో కొంతమంది శరీరభాగాలు వేరయ్యాయి. వాహనం ధ్వంసమైంది. డెహ్రాడూన్‌లోని ఒఎన్‌జిసి చౌక్ వద్ద మంగళవారం తెల్లవారుజామున 1:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థుల కారు వెనుక నుండి ట్రక్కును ఢీకొట్టడంతో వాహనం నుజ్జునుజ్జు అయింది. ఆరుగురు ప్రయాణీకులు సంఘటనా స్థలంలో మరణించగా, ఏడవ వ్యక్తి 25 ఏళ్ల సిద్ధేష్ అగర్వాల్ తీవ్ర గాయాలతో సినర్జీ ఆసుపత్రిలో చేరాడు. ప్రమాదం జరిగిన కొద్ది క్షణాల్లోనే సిద్ధేష్ ఐఫోన్ పోలీసు కంట్రోల్ రూమ్‌కు అత్యవసర SOSను పంపిందని, అది అతని ప్రాణాలను కాపాడింది.

Next Story