విమానాలకు బాంబు బెదిరింపులపై లోతైన దర్యాప్తు జరుగుతోంది: కేంద్రమంత్రి రామ్మోహన్‌

విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు.

By అంజి  Published on  27 Oct 2024 11:54 AM IST
investigation, bomb threats , Union Minister Rammohan Naidu, National news, plane

విమానాలకు బాంబు బెదిరింపులపై లోతైన దర్యాప్తు జరుగుతోంది: కేంద్రమంత్రి రామ్మోహన్‌

విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రచారం జరుగుతోందన్నారు. బాంబు బెదిరింపులపై లోతైన దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. విచారణ తరువాత బాంబు బెదిరింపులు తప్పుడు ప్రచారం వెనుక ఎవరున్నారనే దానిపై స్పష్టత వస్తుందని వివరించారు. బాంబు బెదిరింపులను అరికట్టడానికి ట్విట్టర్, లా ఏజెన్సీలు, ఇంటిలిజెన్స్ సహకారం తీసుకుంటున్నామని, సివిల్ ఏవియేషన్ లో ఉన్న రెండు చట్టాలలో మార్పులు చేస్తున్నామని చెప్పారు. నూతన చట్టం తీసుకువచ్చి బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నవారికి విమాన ప్రయాణం నిషేధించాలని ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో త్వరలో సీ ప్లేన్లు అందుబాటులోకి తీసుకువస్తున్నామని రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. అటు నిన్న విశాఖ-విజయవాడ మధ్య మరో రెండు విమాన సర్వీసులు ప్రారంభించిన అనంతరం కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇరుముడితో విమానంలో ప్రయాణించేందుకు అనుమతినిస్తున్నట్లు తెలిపారు.

Next Story