ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఓ వృద్ధ మహిళ చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. దీంతో మహిళ బాడీని ఇంటికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు.. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే శ్మశానవాటికకు తీసుకువెళుతుండగా వృద్ధురాలు ఒక్కసారిగా కళ్లు తెరిచింది. బ్రెయిన్ హెమరేజ్‌తో బాధపడుతున్న హరిభేజీ అనే 81 ఏళ్ల వృద్ధురాలు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించిన తర్వాత ఈ షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు ఆమెను తీసుకెళ్తుండగా, ఆమె ఒక్కసారిగా కళ్లు తెరిచి అందరినీ షాక్‌కు గురి చేసింది.
ఆ తర్వాత ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. కానీ ఆమె ప్రాణాలు ఎక్కువ సేపు నిలవలేదు. మరుసటి రోజు ఆమె మరణించింది. డిసెంబర్ 23న ఆమెను ఫిరోజాబాద్‌లోని ట్రామా సెంటర్‌లో చేర్పించారు. ఈ మంగళవారం మెదడు పనిచేయడం ఆగిపోయిందని వైద్యులు నిర్ధారించారు. అయితే, ఆమెను శ్మశాన వాటికకు తీసుకెళ్తుండగా ఆమె కళ్లు తెరిచింది. ఆమె పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందింది. ఆ తర్వాత ఆమె కుమారుడు సుగ్రీవ్ సింగ్ ఆమె అంత్యక్రియలు చేశారు. ఆమె కుమారుడు మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం సన్నివేశాన్ని వివరించాడు. తన తల్లి బతికే ఉందని, అయితే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని చెప్పాడు.