ఏప్రిల్ 19న మొదటి దశ లోక్‌సభ ఎన్నికలకు మూడు రోజుల ముందు ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అగ్రశ్రేణి నక్సల్ నాయకుడు మరణించినట్లు వర్గాలు మంగళవారం తెలిపాయి. నక్సల్ నేత శంకర్‌రావు తలపై రూ.25 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. మాద్ అటవీ ప్రాంతంలో పోలీసులు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 18 మంది మావోయిస్టులు మరణించారు. ఛోటేబెతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. నాలుగు ఏకే-47 రైఫిల్స్‌తో సహా పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ కళ్యాణ్ ఎల్లిసెల తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.
ఎన్‌కౌంటర్ జరుగుతుండగా, గాయపడిన సైనికులను రక్షించేందుకు అదనపు బలగాలను పంపినట్లు ఎస్పీ కళ్యాణ్ ఎల్లిసెల తెలిపారు. న్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని కాంకేర్ జిల్లా పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారని, ఇప్పటి వరకు 18 మంది మృతదేహాలను వెలికి తీశారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కంకేర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఏప్రిల్ 26న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి.