బావిలో పడిన భర్తను కాపాడేందుకు భార్య సాహసం..అవాక్కైన ఫైర్ సిబ్బంది
కేరళలో ఓ మహిళ తన భర్త ప్రాణాలు రక్షించుకునేందుకు అడ్వెంచర్ చేసింది.
By Knakam Karthik
బావిలో పడిన భర్తను కాపాడేందుకు భార్య సాహసం..అవాక్కైన ఫైర్ సిబ్బంది
కేరళలో ఓ మహిళ తన భర్త ప్రాణాలు రక్షించుకునేందుకు అడ్వెంచర్ చేసింది. ఎర్నాకుళం జిల్లాలోని పిరవమ్ పట్టణానికి చెందిన 64 ఏళ్ల రమేశన్ బుధవారం మిరియాల తీగల నుంచి వాటిని కోసేందుకు చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు నిచ్చెన జారిపోయింది. ఈ మిరియాల చెట్టు కాస్త చేద బావికి దగ్గర ఉండటంతో రమేషన్ దానిలో పడిపోయాడు. దీంతో వెంటనే పెద్ద శబ్ధం చేశాడు. భర్త కేకలు విని ఇంట్లో ఉన్న అతని భార్య పద్మ బయటకు పరుగెత్తుకుంటూ వచ్చి తన భర్త 40 అడుగుల బావిలో పడిపోవడం చూసి షాకయ్యింది. ఆమె ఒక్కసారిగా కేకలు వేస్తూ, నెమ్మదిగా తాడు సహాయంతో బావిలోకి దిగింది. నీటిలో రమేశన్‌ను మునిగిపోకుండా 20 నిమిషాల పాటు బావిలోనే భర్తను పట్టుకుని సహాయం కోసం ఎదురుచూసింది.
పద్మ కేకలు విన్న స్థానికులు బావి వద్దకు చేరుకున్నారు. ఐదు అడుగుల లోతు ఉన్న నీటిలో తాడు సహాయంతో భర్తను గట్టిగా పట్టుకుని ఉన్న ఆమె చూశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దాదాపు 20 నిమిషాల తర్వాత రెస్య్యూ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అప్పటివరకు ఆ దంపతులు బావిలోనే ఉన్నారు. అయితే రెస్క్యూ టీమ్ బావిలోకి దిగాల్సిన అవసరంలేదని, బదులుగా వలను పంపాలని అధికారులను కోరింది. దీంతో వల సహాయంతో మొదట భర్త రమేశన్‌ను పైకి తీశారు. ఆ తర్వాత అదే వలలో పద్మ బావి నుంచి పైకి వచ్చింది. తాడుతో బావిలోకి దిగడం కారణంగా చేతులకు స్వల్ప గాయాలైన పద్మతో పాటు ఆమె భర్త రమేశనన్‌ను హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వారిద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆపరేషన్‌లో పాల్గొన్న అగ్నిమాపక అధికార ప్రఫుల్ తెలిపారు.
40 അടി താഴ്ച്ച ഉള്ള കിണറ്റിലേക്ക് വീണ ഭർത്താവിനെ രക്ഷിക്കാൻ കയറിൽ തൂങ്ങി ഇറങ്ങി ഭാര്യ pic.twitter.com/oVcTN2aOxp
— BRUTU #AUG21 ❤️ (@Brutu24) February 5, 2025