ప్రమాదకారిగా మారిన కరోనా మ్యుటేషన్.. ఈ సారి ఇండియాలో.?
Dangerous Corona Mutation In India. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించి రోజురోజుకు మరణాల రేటు పెరుగుతుండడంతో
By Medi Samrat Published on 11 Jan 2021 11:33 AM ISTప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించి రోజురోజుకు మరణాల రేటు పెరుగుతుండడంతో ప్రపంచం మొత్తం తీవ్ర భయాందోళనలకు గురి అయింది. కానీ మన భారత దేశ ప్రజలలో రోగనిరోధక శక్తి అధికంగా ఉండటం వల్ల కరోనా మహమ్మారి నుంచి కోలుకొని బయట పడుతున్నారు. ఇదిలా ఉండగా లండన్ నుంచి కొత్తగా వచ్చిన స్ట్రెయిన్ కేసులు నమోదు కావడంతో మరోసారి ప్రపంచం మొత్తం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అయితే అంతే ప్రమాదకరమైన మరో కరోనా మ్యుటేషన్ ఇండియాలో కనిపించడంతో ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో కలిగిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌కు చెందిన ముగ్గురు కరోనా పేషెంట్ల శాంపిల్ పరీక్షించగా వారిలో ఈ మ్యుటేషన్‌ను కనుగొన్నారు. ఖర్గార్‌లోని టాటా మెమోరియల్ సెంటర్ దీనికి E484K మ్యుటేషన్‌గా పిలుస్తున్నారు. సౌత్ ఆఫ్రికా లో కనిపించిన 3 మ్యుటేషన్ల ఇది ఒకటని అసోసియేట్ ప్రొఫెసర్ నిఖిల్ పట్కార్ తెలియజేశారు. జెనటిక్ సీక్వెన్స్ లో భాగంగా దాదాపు 700 శాంపిల్స్ పరీక్షిస్తున్న నేపథ్యంలో వారిలో ముగ్గురిలో ఈ మ్యుటేషన్ కనిపించిందని, దీని వల్ల మన శరీరంలో వైరస్ తో పోరాడే యాంటీబాడీలు సైతం నశించిపోతుందని తెలియజేశారు.
సౌతాఫ్రికాలో కనిపించిన ఈ E484K ఎంతో ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. సాధారణంగా వాక్సినేషన్ ఇవ్వడం ద్వారా మన శరీరంలో యాంటీబాడీలు అభివృద్ధి జరిగే వ్యాధికారక వైరస్ లతో పోరాడుతాయి. అలాంటిది ఈ ఈ మ్యుటేషన్ ఏకంగా యాంటీబాడీలను బోల్తా కొట్టించడంతో వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ మ్యుటేషన్ ఇండియాలో కనుక విజృంభిస్తే పరిస్థితులు ఎంతో దారుణంగా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ మ్యుటేషన్ బారినపడ్డ ముగ్గురు పేషెంట్లు సెప్టెంబర్ నెలలో కరోనాకు గురయ్యారని, వీరిలో ఇద్దరు హోమ్ క్వారంటైన్ ఉండగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారాని డాక్టర్ నిఖిల్ పట్కార్ తెలిపారు.