అరేబియా సముద్రంలో మరో తుఫాను

Cyclone Shaheen likely to form over the Arabian Sea by October 1.గులాబ్ తుపాను సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Sep 2021 2:39 AM GMT
అరేబియా సముద్రంలో మరో తుఫాను

గులాబ్ తుపాను సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. భారీ వ‌ర్షాల కార‌ణంగా లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం కాగా.. భారీ స్థాయిలో పంట న‌ష్టం వాటిల్లింది. ఇంకా ఈ తుఫాన్ సృష్టించిన విధ్వంసం నుంచి ఇంకా తేరుకోనేలేదు. ఉత్త‌ర అరేబియా స‌ముద్రంలో మ‌రో తుఫాను ఏర్ప‌డ‌నుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ గుజరాత్ తీరంలో అల్పపీడనంగా కొనసాగుతోంది. ఐతే ఆ తుపాను అవశేషాలు అరేబియా సముద్రంలోకి ప్రవేశించిన తర్వాత మళ్లీ బలపడనుందని అంటున్నారు.

ఇది అక్టోబ‌ర్ 1 నాటికి తుఫాన్ గా మారనుందని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. దీనికి 'సైక్లోన్ షహీన్' అని నామకరణం చేశారు. ఈ పేరును ఖ‌తార్ సూచించింది. అయితే.. దీని ప్ర‌భావం భార‌త్‌పై పెద్ద‌గా ఉండ‌ద‌ని అంటున్నారు. ఇది పాకిస్థాన్ వైపు వెళ్ల‌నుంద‌న్నారు. కాగా.. భారీ వర్షాల కారణంగా ఉత్తర కొంకణ్‌, గుజరాత్, కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో 24 గంటలపాటు రెడ్ అలర్ట్ ప్రకటించారు.

Next Story