పార్టీలు, నాయకుల పేరుతో సైబర్‌ వల.. ఆ లింక్‌లు క్లిక్‌ చేస్తే ఇక అంతే..

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి నెలకొంది. దీంతో రాజకీయ పార్టీలు తమదైన శైలిలో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారం చేస్తున్నాయి.

By అంజి  Published on  30 Oct 2023 9:51 AM IST
Cyber ​​criminals, Cyber ​​crime, free recharge, elections, PIB

పార్టీలు, నాయకుల పేరుతో సైబర్‌ వల.. ఆ లింక్‌లు క్లిక్‌ చేస్తే ఇక అంతే..

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి నెలకొంది. దీంతో రాజకీయ పార్టీలు తమదైన శైలిలో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారం చేస్తున్నాయి. ఇదే అదునుగా భావించి కొందరు సైబర్‌ నేరగాళ్లు ప్రజలను బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ నాయకులు, పార్టీల పేర్లు వాడుకుని సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సోషల్‌ మీడియాలో ఇప్పటికే ఓ మెసేజ్‌ విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఓ జాతీయ పార్టీ మూడు నెలలు ఫ్రీగా ఫోన్‌ రీఛార్జ్‌ చేస్తుందంటూ వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో పోస్టులు, మెసేజ్‌లు వైరలవుతున్నాయి. "ఫ్రీ రీఛార్జ్‌ కోసం కింద ఉన్న లింకును గడువులోగా క్లిక్‌ చేసి నమోదు చేసుకోండి" అని అందులో ఉంది. దీనికి ఓ పార్టీ అధికారిక వెబ్‌సైటుకు దగ్గరగా ఉండే వెబ్‌ అడ్రస్‌ లింకు ఇచ్చారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి వేళ.. ఈ మెసేజ్‌ బాగా వైరల్‌ అవుతోంది. ఇదే మెసేజ్‌ ఆరు నెలల కిందట కూడా వైరల్‌ అయ్యింది.

కాగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్‌ ఇన్పర్మేషన్‌ బ్యూరో ఫ్యాక్ట్‌ చెక్‌ చేసి.. ఇది నిజం కాదని తేల్చింది. అయితే ఇప్పటి వరకు ఈ లింక్‌లో రిజిస్ట్రర్‌ చేసుకున్న వారేవరూ నష్టపోయిన ఘటనలు వెలుగులోకి రాలేదు.. కానీ ఎన్నికల టైంలో కొందరైనా మోసపోయే ఆస్కారం ఉంది. పెస్టివల్‌ సీజన్‌ కూడా కావడంతో అభ్యర్థులు, పార్టీలు వివిధ రకాల ఆఫర్లు ఇస్తున్నట్లు ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థల పేర్లకు దగ్గరగా ఉండే లింకులతో నమ్మించేందుకు సైబర్‌ మోసగాళ్లు ప్రయత్నిస్తారు. వాటిని క్లిక్‌ చేసి ఓపెన్‌ చేస్తే బ్యాంకు అకౌంట్లు ఖాళీ అయ్యే ప్రమాదముంది. ఈ నేపథ్యంలోనే పార్టీల పేరిట ఉచితాలు, రాయితీలంటూ వచ్చే సోషల్‌ మీడియా లింకులతో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ఎలక్షన్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమలులో ఉన్న సమయంలో పార్టీల తరఫున ఇలాంటి బహిరంగ ఆఫర్లు ఇవ్వరన్న విషయం గుర్తించాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story