రూపీ సింబల్‌ మార్పుపై విమర్శలు.. రూపకర్త ఏమన్నారంటే?

తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం రూపీ సింబల్‌ను మార్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది విభజనవాదానికి దారి తీస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

By అంజి
Published on : 14 March 2025 9:07 AM IST

rupee symbol, Tamilnadu Govt, National news, ₹, Uday Kumar

రూపీ సింబల్‌ మార్పుపై విమర్శలు.. రూపకర్త ఏమన్నారంటే?

తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం రూపీ సింబల్‌ను మార్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది విభజనవాదానికి దారి తీస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సొంత రూపీ సింబల్‌ అంటున్నారని, రాను రాను సొంత మిలిటరీ, సొంత దేశం అని కూడా అనొచ్చని చెబుతున్నారు. కేంద్రంతో వివాదం ఉంటే దేశం మొత్తానికి వర్తించే రూపీ సింబల్‌ మార్చడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. త్రిభాషా వివాదం నేపథ్యంలో బడ్జెట్‌ కాపీపై రూపీ సింబల్‌ (₹)ను తమిళనాడు ప్రభుత్వం తొలగించింది. రూపీ సింబల్‌కు బదులు తమిళ 'రూ' అక్షరాన్ని పేర్కొంది.

దీనిపై రూపీ సింబల్‌ రూపకర్త ఉదయ్‌ కుమార్‌ స్పందించారు. '₹ చిహ్నానికి రూపకర్తగా ఉండటం సంతోషంగా ఉంది. దీనిపై వివాదం జరుగుతుందని ఊహించలేదు. ఈ మార్పుకు గల కారణాలు నాకు తెలియదు. బహుశా రాష్ట్ర ప్రభుత్వానికి దాని స్వంత అభిప్రాయాల, కారణాలుఆ ఉండవచ్చు' అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉదయ కుమార్‌.. ఐఐటీ గువాహటిలో ప్రొఫెసర్‌గా ఉన్నారు.

రూపాయి గుర్తు ఎలా వచ్చిందంటే?

దివంగత ఆర్థిక మంత్రి ప్రణబ్‌ 2009లో కేంద్ర బడ్జెట్‌ సమయంలో రూపాయికి గుర్తు సూచించాలని ఓపెన్ కాంపిటిషన్‌ ప్రకటించారు. 3331 డిజైన్లలో 5 షార్ట్‌ లిస్ట్‌ చేసి డీఎంకే మాజీ ఎమ్మెల్యే కుమారుడు, ప్రొఫెసర్‌ ఉదయ్‌ పంపినది ఎంపిక చేశారు. ఇది దేవనాగరి లిపి र, 'ra', లాటిన్‌లో ఇంగ్లీష్‌లో నిలువు గీత లేని Rను పోలి ఉంటుంది. ₹లో రెండు సమాన అడ్డగీతలు అసమానతల్లేని సంపద పంపిణీని సూచిస్తాయి.

Next Story