మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆవులు, వాటి పేడ, మూత్రంతో ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయొచ్చునని తెలిపారు. ఆవు పేడ, మూత్రం వినియోగంపై సరైన వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా.. దేశ, రాష్ట్ర, ఆర్థిక వ్యవస్థలు బలోపేతం కావడానికి సహాయపడుతాయని అన్నారు. బోపాల్‌లో ఇండియన్ వెటర్నరీ అసోసియేషన్ మహిళా పశువైద్యుల సమ్మేళనం సదస్సు జరిగింది. ఈ సదస్సుకు హాజరైన శివరాజ్ సింగ్ మాట్లాడారు.
గోవుల సంరక్షణలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావించారు. అనేక ప్రాంతాల్లో గోశాలలు ఏర్పాటు చేసిందన్నారు. సమాజ భాగస్వామ్యంతోనే పశుసంరక్షణ సాధ్యమౌతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది మహిళలు గోవుల పెంపకంపై ఆధారపడుతున్నారని, డెయిరీ వ్యాపారంలో వారు సఫలం అయ్యారనన్నారు. ఆవులు, వాటి పేడ మూత్రం వినియోగంపై సరైన వ్యవస్థను ఏర్పాటు చేస్తే రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడానికి సహాయపడతాయన్నారు.