అధికారుల నిర్ల‌క్ష్యం.. నిరుప‌యోగంగా మారిన 480 కోవిషీల్డ్ వ్యాక్సిన్లు

Covid vaccine wastage in Rajasthan.క‌రోనా మ‌హమ్మారి క‌ట్ట‌డికి వ్యాక్సినేష‌న్ ఒక్క‌టే మార్గ‌మ‌ని నిపుణులు చెబుతున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jun 2021 7:08 AM GMT
అధికారుల నిర్ల‌క్ష్యం.. నిరుప‌యోగంగా మారిన 480 కోవిషీల్డ్ వ్యాక్సిన్లు

క‌రోనా మ‌హమ్మారి క‌ట్ట‌డికి వ్యాక్సినేష‌న్ ఒక్క‌టే మార్గ‌మ‌ని నిపుణులు చెబుతున్న సంగ‌తి తెలిసిందే. దేశంలో క‌రోనా వ్యాక్సిన్ల కొర‌త తీవ్రంగా వేదిస్తోంది. టీకా తీసుకునేందుకు ప్ర‌జ‌లు బారులు తీరుతున్నారు. ఇంత డిమాండ్ ఉన్న‌ప్ప‌టికి అధికారుల నిర్ల‌క్ష్యంతో కొన్ని చోట్ల టీకాలు నిరుప‌యోగంగా మారిపోతున్నాయి. రాజ‌స్థాన్ రాష్ట్రంలో 480 కోవిషీల్డ్ వ్యాక్సిన్లు నిరుప‌యోగంగా మారాయి. పాడైన రిఫ్రిజిరేట‌ర్‌లో వాటిని నిల్వ‌చేయ‌డంతో అవి గ‌డ్డ‌క‌ట్టి పాడైపోయాయి. ఈ ఘటన బన్స్వారా జిల్లా రఘునాథపుర గ్రామంలో చోటుచేసుకుంది.

గ్రామంలోని ప్ర‌జ‌ల‌కు ఇచ్చేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ( పీహెచ్‌సీ) టీకాలు తీసుకొచ్చారు. మే 22 నుంచి అక్క‌డ ఉండే ఫ్రిజ్ పాడైంది. అయినా దానిని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. దీంతో అందులో నిల్వ ఉంచిన వ్యాక్సిన్లు నిరుప‌యోగంగా మారాయి. ఈ విషయం చీఫ్‌ మెడికల్‌ హెల్‌ ఆఫీసర్‌ దృష్టికి వెళ్లింది. మహేంద్ర పర్మర్‌ ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల బృంధం పీహెచ్‌సీ కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్లను పరిశీలించారు. అవి గ‌డ్డ‌క‌ట్టి వ్య‌ర్థంగా మార‌డంతో దీనికి కార‌ణ‌మైన పీహెచ్‌సీ సిబ్బందికి అధికారులు నోటీసులుజారీ చేశారు.

Next Story
Share it