ఆ తెగలకు కొవిడ్ ముప్పు ఎక్కువ... తాజా పరిశోధనలో వెల్లడి.!

Covid threat is greater for smaller tribes. అడవులు, కొండలు మారు మూల ప్రాంతాల్లో నివసించే తెగల్లో కరోనా వైరస్‌ ఎక్కువగా విజృంభిచే అవకాశాలు ఉన్నాయని

By అంజి  Published on  14 Oct 2021 1:05 PM IST
ఆ తెగలకు కొవిడ్ ముప్పు ఎక్కువ... తాజా పరిశోధనలో వెల్లడి.!

అడవులు, కొండలు మారు మూల ప్రాంతాల్లో నివసించే తెగల్లో కరోనా వైరస్‌ ఎక్కువగా విజృంభిచే అవకాశాలు ఉన్నాయని తాజా పరిశోధనల్లో తెలిసింది. చిన్న చిన్న సముహాలు, తెగల్లో జనువైవిధ్యం లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సీసీఎంబీ పరిశోధకులు చేసిన తాజా అధ్యయనాలు ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చాయి. సాధారణంగా అడవులు, మారుమూల ప్రాంతాల్లో నివసించే తెగల్లో జనాభా తక్కువగానే ఉంటుంది. మరీ ముఖ్యంగా వారిలో వారే విహాలు చేసుకుంటారు. ఇలా వారిలో వారే వివాహాలు చేసుకోవడం వల్ల జన్యు వైవిధ్యం ఎక్కువగా ఉండదు. ఇలాంటి తెగల్లో పుట్టే సంతానంలో జన్యుపర సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కరోనా వైరస్ విజృంభణ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు తెగలపై తీవ్ర ప్రభావం చూపింది.. బ్రెజిల్‌ దేశంలోని కొన్ని తెగల్లో అయితే ఏకంగా మరణాల రేటు రెండు రెట్లు పెరిగింది.

భారత్‌లోని అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో కొన్ని వేల సంవత్సరాల నుంచి చిన్న చిన్న సమూహాలు నివసిస్తున్నాయి. అయితే వారికి కొవిడ్ నుంచి వచ్చే ముప్పు గురించి తెలుసుకునేందుకు.. డీఎన్‌ఏ ఆధారంగా సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ, బీహెచ్‌యూ పరిశోధకులు విశ్లేషించారు. సెంటర్‌ ఫర్‌ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ డైరెక్టర్‌ డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ తాజా అధ్యయన విషయాలను వెల్లడించారు. 227 జాతులకు చెందిన 1600 మంది వ్యక్తుల డీఎన్‌ఏను విశ్లేషించామని తెలిపారు. అండమాన్‌లోని ఒంగే, జరావా వంటి తెగలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని తెగ, ఇంకొన్ని జాతుల వ్యక్తులు ఒకే రకమైన జన్యువును కలిగి ఉన్నారని పరిశోధనలో వెల్లడైందన్నారు. ఈ తెగల్లో జన్యు వైవిధ్యం కనిపించకపోవడంతో.. కొవిడ్ సోకే ముప్పు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు అంచనా వేశారు.

Next Story