బీహార్ లో అమానవీయ ఘటన.. చెత్త బండిపై కోవిడ్ బాధితుని మృతదేహం..

Covid patients dead body carried on garbage cart in Bihar. పిఇ కిట్ ధరించిన మునిసిపల్ కార్పొరేషన్ కార్మికులు ఒక కోవిడ్ బాధితుడి మృతదేహాన్ని చెత్త బండిపైబీ హర్‌షరీఫ్‌లోని ఓ శ్మశానవాటికకు తీసుకెళ్లారు.

By Medi Samrat
Published on : 17 May 2021 2:46 PM IST

బీహార్ లో అమానవీయ ఘటన.. చెత్త బండిపై కోవిడ్ బాధితుని మృతదేహం..

కరోనా ఒకరినుంచి ఒకరికి అత్యంత సులభంగా సంక్రమించే వ్యాధి కావడంతో ప్రజలు సామాజిక దూరాన్ని పాటించక తప్పటం లేదు. అయితే రాను రాను ఈ వైరస్ మహమ్మారి మనుషుల్లోని మానవత్వానికి పెద్ద పరీక్ష పెడుతోంది. అందరూ కలిసికట్టుగా మహమ్మారిని ఎదుర్కోవాల్సిన టైంలో కొన్ని అమానవీయ సంఘటనలు జరుగుతున్నాయి. లాక్ డౌన్, కర్ఫ్యూ సమయంలో జాగ్రత్త పడటం మానేసి బలాదూర్ తిరుగుతున్న వ్యక్తులు మరణం దగ్గరకి వచ్చేసరికి అతి జాగ్రత్త పడుతున్నారు. కరోనాతో చనిపోతే సాటి మనిషిగా ఇవ్వాల్సిన కనీస గౌరవం ఇవ్వకపోగా, బాధ్యతగా చేయాల్సిన అంత్యక్రియలను కూడా క్రూరంగా తిరస్కరించేస్తున్నారు.

ఇప్పటికే చాలా చోట్ల చనిపోయిన కరోనా పేషెంట్లను శ్మశానానికి తీసుకువెళ్ళడానికి అంబులెన్స్ లు దొరకక ట్రాక్టర్ల లోనూ.. బైక్ ల మీదా తరలించిన దృశ్యాలు కనిపించాయి. ఇప్పుడు బీహార్ లో అలాంటి సంఘటనే జరిగింది. పిపిఇ కిట్ ధరించిన మునిసిపల్ కార్పొరేషన్ కార్మికులు ఒక కోవిడ్ బాధితుడి మృతదేహాన్ని చెత్త బండిపైబీ హర్‌షరీఫ్‌లోని ఓ శ్మశానవాటికకు తీసుకెళ్లారు.

వీడియో వైరల్ కావడంతో సంఘటనపై నలంద సివిల్ సర్జన్ డాక్టర్ సునీల్ కుమార్ స్పందించారు. సరైన దర్యాప్తు తర్వాత ఈ సంఘటనలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతదేహాలను శ్మశానవాటికకు తీసుకెళ్లడానికి తగినన్ని వాహనాలు ఏర్పాటు చేసామని, అయినా ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకుంటామన్నారు. అయితే మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఇలా చేయవలసి వచ్చిందని, ఇలాంటి వారికి మాత్రమే తాము అంత్యక్రియలు చేస్తామని కార్పొరేషన్ వారు చెబుతున్నారు.



Next Story