బ్రిట‌న్ స్ట్రెయిన్‌కు కోవాగ్జిన్‌తో సత్ఫలితాలు

Covaxin Effectively Neutralises UK Covid Strain, Claims Bharat Biotech. యూకే కొత్త రకం వైరస్‌ కేసులు భారత్‌లో పెరుగుతున్న

By Medi Samrat
Published on : 27 Jan 2021 6:13 PM IST

Covaxin Effectively Neutralises UK Covid Strain

యూకే కొత్త రకం వైరస్‌ కేసులు భారత్‌లో పెరుగుతున్న నేపథ్యంలో టీకా తయారీ కంపెనీ భారత్‌ బయోటెక్‌ కీలక విషయాన్ని వెల్లడించింది. తాము రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌ కోవాగ్జిన్‌ బ్రిటన్‌ స్ట్రెయిన్‌ వైరస్‌పై సమర్ధవంతంగా పని చేస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం భారత్ బయోటెక్‌ ట్వీట్ చేసింది.


చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్‌ కంటే 70 శాతం ఎక్కువగా ఈ కొత్తరకం వైరస్‌ వ్యాపిస్తున్నట్లు ఇది వరకే పరిశోధకులు తెలిపారు. అయితే ఈ బ్రిటన్‌ కొత్త వేరియంట్‌ వైరస్‌ను తమ వ్యాక్సిన్‌ కోవాగ్జిన్‌ విజయవంతంగా నిలువరిస్తుందని వెల్లడించింది. దీనికి నేషనల్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధన లింక్‌ను షేర్‌ చేసింది. ఈ ప్రాణాంతకరమైన వైరస్‌ వల్ల మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోందని ఇటీవల బ్రిటన్ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో చాలా దేశాల్లో ఇతర దేశాల ప్రయాణికుల రాకపోకలు నిలిపివేశాయి. ఇప్పటికే బ్రిటన్‌ నుంచి విమానాల ద్వారా ఇండియాకు చేరిన వారిలో 150 మంది యూకే స్ట్రెయిన్‌ బారిన పడ్డారు.

ముందే కరోనాతో ఏడాదిగా దేశాలు అతలాకుతలం అవుతుంటే కొత్తగా వచ్చిన స్ట్రెయిన్‌ వైరస్‌ మరింత భయాందోళనకు గురి చేస్తోంది. అయితే తాజాగా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు కొత్త వైరపై పని చేస్తుందా..? లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో భారత్‌ బయోటెక్‌ క్లారిటీ ఇచ్చింది. కొత్త రకం వైరస్‌పై ఎలాంటి భయాందోళన చెందవద్దని, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ అద్భుతంగా పని చేస్తుందని స్పష్టం చేసింది.


Next Story