లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధాని త‌న‌యుడికి ఊర‌ట‌

మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కొడుకు హెచ్‌డీ రేవణ్ణపై లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే.

By -  Medi Samrat
Published on : 30 Dec 2025 8:41 AM IST

లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధాని త‌న‌యుడికి ఊర‌ట‌

మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కొడుకు హెచ్‌డీ రేవణ్ణపై లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే. ఈ కేసులో రేవణ్ణకు ఊరట లభించింది. 2024లో నమోదైన లైంగిక వేధింపుల కేసులో బెంగుళూరు కోర్టు సోమవారం ఆయనను నిర్దోషిగా ప్రకటించింది.

హాసన్ జిల్లా హోలెనర్సీపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి ఫిర్యాదు చేయడంలో నాలుగేళ్లు జాప్యం జరిగింద‌ని పేర్కొంటూ ఏసీజేఎం కేఎన్ శివకుమార్ ఆరోపణలను స్వీకరించేందుకు నిరాకరించారు. ఐపీసీ సెక్షన్ 354ఏ కింద అభియోగాల జాప్యాన్ని క్షమించే ప్రసక్తే లేదని కోర్టు పేర్కొంది.

హెచ్‌డీ రేవణ్ణ తనయుడు ప్రజ్వల్ రేవణ్ణపై పలు లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులు నమోదైన తరుణంలో ఆయన తండ్రిపై కూడా ఆరోపణలు రావడం రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించింది.

Next Story