ట్యూషన్‌ సెంటర్‌లో కరోనా కలకలం..!

Corona positive for 8 students. గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌ నగరంలో కరోనా కలకలం రేగింది. ఓ ట్యూసన్‌ సెంటర్‌లో ఎనిమిది మంది విద్యార్థులకు కరోనా

By అంజి  Published on  16 Oct 2021 11:01 PM IST
ట్యూషన్‌ సెంటర్‌లో కరోనా కలకలం..!

గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌ నగరంలో కరోనా కలకలం రేగింది. ఓ ట్యూసన్‌ సెంటర్‌లో ఎనిమిది మంది విద్యార్థులకు కరోనా సోకింది. ఈ నెల 7వ తేదీన ట్యూషన్‌ సెంటర్‌ వెళ్లే ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో ట్యూషన్‌ సెంటర్‌లోని 125 మంది విద్యార్థులకు కరోనా టెస్టులు నిర్వహించారు. దీంతో ఏడుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని సూరత్‌ డిప్యూటీ మున్సిపల్‌ కమిషనర్‌ ఆశిష్‌ నాయక్‌ తెలిపారు.

ఈ నేపథ్యంలోనే ట్యూషన్‌ సెంటర్‌ను కూడా అధికారులు మూసివేశారు. సూరత్‌లో స్కూళ్లు, కాలేజీల్లో కరోనా కేసులు వెలుగు చూడటం ఈ నెలలో ఇది రెండోసారి. ఈ నెల మొదట్లో కూడా కొంతమంది విద్యార్థులకు కరోనా సోకడంతో ఓ స్కూల్‌ను మూసివేశారు. సూరత్‌లో ఇప్పటి వరకు 1,11,669 కరోనా కేసులు నమోదు కాగా.. 1,629 మంది కోవిడ్‌ బారిన పడి మృతి చెందారు. సూరత్‌లో 1,09,975 మంది కరోనా బారిన పడి రీకవరి అయ్యారు.

Next Story