దేశంలో కరోనా విలయ తాండవం..

Corona Cases In India. దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 14,00,122 కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించగా.. 1,61,736 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ.

By Medi Samrat  Published on  13 April 2021 5:06 AM GMT
India corona cases

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 14,00,122 కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించగా.. 1,61,736 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయిన‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,36,89,453కు చేరింది. నిన్న ఒక్క రోజే 879 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ మ‌హ‌మ్మారి దేశంలో మొద‌లైన‌ప్ప‌టికి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 1,71,058కు చేరింది.

నిన్న ఒక్క రోజే 97,168 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌టప‌డ్డారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 1,22,53,697కు చేరింది. ప్రస్తుతం దేశంలో 12,64,698 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా టీకా అందిన వారి సంఖ్య 10,85,33,085కి చేరింది. ఇదిలావుంటే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లకు తోడు రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌కు దేశంలో అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇవ్వడంతో.. రాబోయే రోజుల్లో వ్యాక్సినేషన్‌ మరింత వేగంగా సాగుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
Next Story
Share it