మళ్లీ పట్టాలెక్కిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్

ఒడిశాలోని బాలాసోర్ వద్ద ప్రమాదానికి గురై తీవ్ర విషాదాన్ని నింపిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు మళ్లీ పట్టాలెక్కింది.

By అంజి  Published on  6 Jun 2023 6:00 PM IST
Coromandel Express, train, fatal accident, Odisha

మళ్లీ పట్టాలెక్కిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్

ఒడిశాలోని బాలాసోర్ వద్ద ప్రమాదానికి గురై తీవ్ర విషాదాన్ని నింపిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు మళ్లీ పట్టాలెక్కింది. ప్రమాదం తర్వాత రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. ఆ తర్వాత సిబ్బంది ట్రాక్‌ను పునరుద్ధరించి రైళ్ల రాకపోకలకు మార్గం సుగమం చేశారు. మూడు రోజుల తర్వాత చెన్నై-షాలిమర్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ మళ్లీ పట్టాలెక్కింది. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు రైలు బయలుదేరుతున్నట్టు మెసేజ్‌ల ద్వారా సమాచారం అందించారు. సోమవారం ఉదయం 10.45 గంటలకు చెన్నైలోని ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌ నుంచి రైలు బయలుదేరింది.

ఇక కోర‌మాండల్ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్లు బతికే ఉన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్ద‌రు డ్రైవ‌ర్లు భువ‌నేశ్వ‌ర్‌లోని ఏఎంఆర్ఐ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. 36 ఏళ్ల అసిస్టెంట్ లోకో పైలెట్ హ‌జారి బెహిరా సాధారణ వార్డులో చికిత్స పొందుతుండగా, మ‌రో లోకో పైలెట్ డ్రైవ‌ర్ జీఎన్ మోహంతికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ తాను చూసిన గ్రీన్ సిగ్నల్ ఆధారంగానే ముందుకు వెళ్లినట్లు తెలిపాడని రైల్వే బోర్డు సభ్యులు తెలిపారు. ఇలాంటి ప్ర‌మాదాల విష‌యంలో లోకో పైలెట్ల‌తో ఎటువంటి సంబంధం ఉండ‌ద‌ని రైల్వే శాఖ చెబుతోంది.

Next Story