FormulaCarRace: గుండెపోటుతో పోలీసు అధికారి మృతి

చెన్నైలో ఫార్ములా 4 కార్ రేస్ కోసం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ACP) గుండెపోటుతో మరణించారు.

By అంజి  Published on  2 Sept 2024 12:04 PM IST
Cop, Formula 4 car race, heart attack, Chennai

FormulaCarRace: గుండెపోటుతో పోలీసు అధికారి మృతి

చెన్నైలో ఫార్ములా 4 కార్ రేస్ కోసం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ACP) గుండెపోటుతో మరణించారు. ఆదివారం కార్ రేస్, ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్‌ఎల్) కోసం సర్క్యూట్ సిద్ధం చేసిన ఐలాండ్ గ్రౌండ్స్ సమీపంలో శివకుమార్ డ్యూటీలో ఉండగా, ఛాతీ నొప్పితో శుక్రవారం కుప్పకూలిపోయాడు. పోలీసు అధికారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

శివకుమార్ కుటుంబానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సానుభూతి తెలుపుతూ రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. గ్రేటర్ చెన్నై పోలీసు కమిషనర్ ఎ అరుణ్.. పోలీసు అధికారికి అంతిమ నివాళులు అర్పించేందుకు శివకుమార్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను కలిశారు.

Next Story