మందుబాబుల‌కు శుభ‌వార్త‌.. ఇక నుంచి సూప‌ర్ మార్కెట్ల‌లో వైన్ అమ్మ‌కాలు

Consumers in Maharashtra can now buy wine at grocery.మందుబాబుల‌కు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఓ శుభ‌వార్త చెప్పింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jan 2022 8:19 AM IST
మందుబాబుల‌కు శుభ‌వార్త‌.. ఇక నుంచి సూప‌ర్ మార్కెట్ల‌లో వైన్ అమ్మ‌కాలు

మందుబాబుల‌కు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఓ శుభ‌వార్త చెప్పింది. మహారాష్ట్రలోని ప్రతి సూపర్ మార్కెట్‌లో ఇప్పుడు వైన్ అందుబాటులో ఉంటుందని గురువారం ప్ర‌క‌టించింది. కొత్త మ‌ద్యం పాల‌సీ ప్ర‌కారం రాష్ట్రంలోని కిరాణా దుకాణాలు, డిపార్ట్‌మెంటల్ స్టోర్ల ద్వారా వైన్ బాటిళ్ల విక్రయానికి ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన రాష్ట్ర మంత్రి వ‌ర్గ స‌మావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. గతంలో మద్యం దుకాణాల ద్వారా మాత్రమే వైన్ విక్రయాలకు అనుమతి ఉండేది.

ఎన్‌సిపి మంత్రి నవాబ్ మాలిక్ విలేకరులతో మాట్లాడుతూ.. చిన్న మరియు మధ్య తరహా వైన్‌ల బ్రాండ్‌లను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.' పండ్ల ఆధారిత వైన్ తయారీ కేంద్రాల ప్రేర‌ణ పెర‌గాల‌నే ఉద్దేశ్యంతో 10 సంవత్సరాల పాటు జీఎస్టీ(GST)ని ర‌ద్దు చేశాం. రాష్ట్రంలో అమలు చేయబడిన విధానం వ‌ల్ల వైన్ తయారీ కేంద్రాల సంఖ్య పెరుగుతుంది. దీంతో రైతుల‌కు లాభం వ‌స్తుంది. చిన్న మరియు మధ్య తరహా వైన్ తయారీ కేంద్రాల బ్రాండ్‌లను ప్రోత్సహించడంలో సహాయపడటానికి 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న సూపర్ మార్కెట్లు తమ ఉత్పత్తులను స్టాల్/షోకేస్‌లో విక్రయించడానికి అనుమతించబడతాయి. కేబినెట్ సమావేశంలో చర్చ ఆధారంగా ఈ అనుమతి ఇవ్వబడుతుంది' అని నవాబ్ మాలిక్ తెలిపారు.

Next Story