కర్ణాటకలో 'ఆప్' పోటీపై కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Congress's DK Shivakumar on AAP's foray into Karnataka polls. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 224 స్థానాల్లో పోటీ చేస్తుందని అరవింద్ కేజీవాల్

By Medi Samrat
Published on : 29 March 2023 7:15 PM IST

కర్ణాటకలో ఆప్ పోటీపై కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

DK Shivakumar


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 224 స్థానాల్లో పోటీ చేస్తుందని అరవింద్ కేజీవాల్ ప్రకటించిన నేపథ్యంలో.. ఆ పార్టీ ఏ సీటు కూడా గెలవదని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. "వారిని రానివ్వండి. నేను వారిని స్వాగతిస్తున్నాను. వారు దేనినీ గెలవరు" అని శివకుమార్ కర్ణాటకలో ఆప్ అవకాశాలపై స్పందించారు.

మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో.. కర్ణాటక రాజకీయాల్లోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేయనుంది. ఫలితాలు మే 13న వెలువడనున్నాయి. మొత్తం 224 స్థానాల్లో ఆప్ అభ్యర్థులను పోటీకి దించనున్నట్లు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఫలితాలు బాగుంటాయని ఆశిస్తున్నాను అని కేజ్రీవాల్ అన్నారు.

ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించ‌క‌ముందే AAP.. 80 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో సుప్రీంకోర్టు న్యాయవాది బ్రిజేష్ కాళప్ప(చిక్‌పేట), మాజీ బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) అధికారి కే మథాయ్ (శాంతి నగర్), బీటీ నాగన్న (రాజాజీనగర్), మోహన్ దాసరి (సీవీ రామన్ నగర్), శాంతల దామ్లే (మహాలక్ష్మి లేవుట్‌), పద్మనాభనగర్ నుండి అజయ్ గౌడ త‌దిత‌రులు పోటీలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.


Next Story