'నా పెన్ను పోయింది.. క‌నిపెట్టండి.. 'పోలీసుల‌కు ఎంపీ ఫిర్యాదు

Congress Vijay Vasanth MP pen missing police registered complaint.పెన్ను పోయింద‌ని ఓ ఎంపీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 July 2022 1:49 PM IST
నా పెన్ను పోయింది.. క‌నిపెట్టండి.. పోలీసుల‌కు ఎంపీ ఫిర్యాదు

పెన్ను పోయింద‌ని ఓ ఎంపీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పెన్ను పోతే మ‌రో పెన్ను కొనుక్కోవాలి గానీ కంప్లైట్ ఇవ్వ‌డం ఏమిట‌నీ అని ఆలోచిస్తున్నారా..? ఆ పెన్ను మామూలు పెన్ను కాదండి. దాని విలువ అక్ష‌రాలా లక్షా యాబైవేలు పైనే ఉంటుంద‌ట‌. పైగా అది త‌న తండ్రి జ్ఞాప‌కార్థం కావ‌డంతో దాన్ని వెతికి పెట్టాల‌ని స‌ద‌రు ఎంపీ పోలీసుల‌ను ఆశ్ర‌యించాడ‌ట‌.

వివ‌రాల్లోకి వెళితే.. తమిళనాడులోని కన్యాకుమారి కాంగ్రెస్ ఎంపీ విజయ్ వసంత్ త‌న పెన్ను పోయింద‌ని పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చారు. దాని విలువ దాదాపు రూ.1.50ల‌క్ష‌లు ఉంటుంద‌ని, పైగా అది త‌న తండ్రి జ్ఞాప‌కార్థం అని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

పెన్ను ఎక్క‌డ పోయిందంటే..?

విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా ఎన్నికల్లో మద్దతు కోరేందుకు చెన్నై వచ్చారు. గిండీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఆయ‌న‌కు కాంగ్రెస్ శ్రేణులు ఘ‌న స్వాగతం ప‌లికారు. అనంతరం కాంగ్రెస్ స‌భ్యుల స‌పోర్ట్ కోసం మీటింగ్ ఏర్పాటు చేయ‌గా.. అక్క‌డ‌కు వ‌చ్చిన ఎంపీ విజ‌య్ వ‌సంత్ పెన్ను మిస్ అయ్యింద‌ట‌. ప్ర‌స్తుతం పోలీసులు ఆ పెన్నును వెతికే ప‌నిలో ఉన్నారు.

Next Story