ఓపిక పట్టండి.. ఎగ్జిట్ పోల్స్ తారుమారు అవుతాయ్: సోనియాగాంధీ
తాజాగా ఎగ్జిట్ పోల్స్ గణాంకాలపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ స్పందించారు. ఈ మేరకు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 3 Jun 2024 2:15 PM ISTఓపిక పట్టండి.. ఎగ్జిట్ పోల్స్ తారుమారు అవుతాయ్: సోనియాగాంధీ
సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ విడుదలైన విషయం తెలిసిందే. కౌంటింగ్‌కు మరో ఒక్క రోజు సమయం ఉన్న నేపథ్యంలో.. ఎగ్జిట్ పోల్స్ దేశ ప్రజల అందరిలో ఆసక్తిని రేపాయి. దాదాపు కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. తాజాగా ఎగ్జిట్ పోల్స్ గణాంకాలపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ స్పందించారు. ఈ మేరకు ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఎన్నికల ఫలితాలపై తాము ఆశాభావంతో ఉన్నట్లు చెప్పారు సోనియాగాంధీ. జూన్ 4న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు అవుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఇంకొద్ది గంటలే కదా వేచిచూడాలన్నారు. ఇక అంతకుముందు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా ఇవే కామెంట్స్ చేశారు. ఇండియా కూటమి కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు బోగస్ పోల్స్‌ను మోదీ ప్రచారంలోకి తెచ్చారని ఆరోపించారు. ఆయన ఊహల ఫలితాలే ఇవన్నీ అంటూ కొట్టి పారేశారు. ఇండియా కూటమికి 295 సీట్లు వస్తాయనీ రాహుల్‌గాంధీ దీమాగా చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ రాజకీయ అభిప్రాయలు తప్ప నిపుణుల ఫలితాలు కావనీ.. జూన్ 4న నిజమేంటనేది వెల్లడవుతుందని రాహుల్‌గాంధీ అన్నారు.
రాహుల్ గాంధీ కామెంట్స్‌పై బీజేపీ కూడా స్పందించి విమర్శలు చేసింది. ఊహల ప్రపంచంలో జీవించే వ్యక్తి అలాగే మాట్లాడుతారంటూ కౌంట్ వేశారు. రాహుల్‌గాంధీకి ఎగ్జిట్ పోల్స్ ఎలా రూపిందిస్తారో కూడా తెలిదని అన్నారు ఫాంటసీ హాలీడేకు వెళ్లే సమయం వచ్చిందని చెప్పారు. ఆశాభావంతో ఉండటం మంచిది అయితే.. ప్రజలు ప్రధానిమోదీకి ఇచ్చిన ఆశీర్వాదాన్ఇన పక్కన పెట్టలేరన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పలువురు బీజేపీ నాయకులు దీమా చెప్పారు.