అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ డుమ్మా

Congress Skips Crucial All-party Meet Ahead Of Union Budget 2023-24 Session. న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం సోమవారం ఏర్పాటు చేసిన బడ్జెట్‌కు ముందు అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ దూరమైంది.

By M.S.R  Published on  30 Jan 2023 4:21 PM IST
అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ డుమ్మా

న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం సోమవారం ఏర్పాటు చేసిన బడ్జెట్‌కు ముందు అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ దూరమైంది. ఇతర పార్టీలు హాజరు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, ఇతర పార్టీ నాయకులు జమ్మూ కశ్మీర్‌లో భారత్ జోడో యాత్రను నిర్వహిస్తుండడంతో అఖిల పక్ష సమావేశానికి హాజరవ్వలేదు.

ఎన్సీపీకి చెందిన శరద్‌పవార్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా, డీఎంకే నేత టీఆర్‌ బాలు, టీఎంసీ నేతలు సుదీప్‌ బందోపాధ్యాయ, సుఖేందు శేఖర్‌ రే, బీఆర్‌ఎస్‌ నేతలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు చెందిన విజయసాయిరెడ్డి సహా ప్రతిపక్ష పార్టీలకు చెందిన అగ్రనేతలు అందరూ హాజరయ్యారు. AAP, RJD, శివసేన (ఉద్ధవ్ థాకరే) ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ లీడర్‌ రాజ్‌నాథ్‌సింగ్‌, పార్లమెంట్‌ వ్యవహారాల మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, సభా నాయకుడు ప్రహ్లాద్‌ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పీయూష్‌ గోయల్‌ తదితరులు హాజరయ్యారు. మంగళవారం పార్లమెంట్‌ సమావేశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో మొదలుకానున్నాయి. ప్రసంగం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. బుధవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.


Next Story