వైఎస్సార్‌ స్ఫూర్తితోనే భారత్ జోడో యాత్ర చేపట్టా: రాహుల్‌గాంధీ

జూలై 8వ తేదీ వైఎస్సార్‌ జయంతి. ఈ సందర్బంగా దివంగత నేత వైఎస్సార్‌కు నివాళులు అర్పిస్తున్నారు ముఖ్యనాయకులు.

By Srikanth Gundamalla  Published on  8 July 2024 6:13 AM GMT
congress, rahul gandhi, tweet,   ysr ,

వైఎస్సార్‌ స్ఫూర్తితోనే భారత్ జోడో యాత్ర చేపట్టా: రాహుల్‌గాంధీ

జూలై 8వ తేదీ వైఎస్సార్‌ జయంతి. ఈ సందర్బంగా దివంగత నేత వైఎస్సార్‌కు నివాళులు అర్పిస్తున్నారు ముఖ్యనాయకులు. తాజాగా ఎక్స్‌ వేదికగా కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ వైఎస్సార్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్‌ 75వ జయంతి సందర్బంగా రాహుల్‌గాంధీ నివాళులర్పించారు.

రాహుల్‌గాంధీ ఎక్స్‌లో మాట్లాడుతూ...'ఆంధ్రప్రదేవ్‌ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి సందర్బంగా నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు.. ప్రజానీకానికి వైఎస్సార్‌ నిజమైన నాయకుడు అని అన్నారు. ఎప్పుడూ ప్రజల కోసమే బతికిన నేత అనీ... ఆంధ్రప్రదేశ్, భారత దేశ ప్రజల అభ్యున్నతి, సాధికారత పట్ల వైఎస్సార్ చూపిన అంకితభావం, నిబద్ధత ఎంతో స్పూర్తిదాయమన్నారు రాహుల్. వైఎస్సార్ ఇప్పుడు బతికి ఉంటే ఏపీ ముఖచిత్రం మరోలా ఉండేది. కష్టాలు, కన్నీళ్లు ఉండేవి కాదన్నారు. వైఎస్సార్ వారసత్వాన్ని షర్మిల సమర్ధంగా ముందుకు తీసుకెళ్తారని అన్నారు. ఆమె నాయకత్వంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతోందని రాహుల్‌ గాంధీ చెప్పారు.

వైఎస్సార్‌లో ఉన్న దైర్యం, సిద్ధాంతాలు, నాయకత్వ లక్షణాలను అన్నింటినీ షర్మిలో చూశానని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. అలాగే వైఎస్స రాజశేఖర్‌రెడ్డి నుంచి తాను వ్యక్తిగతంగా చాలా విషయాలను నేర్చుకున్నానని అన్నారు. అంతెందుకు భారత్‌ జోడో యాత్ర కూడా వైఎస్సార్‌ పాదయాత్ర నుంచి స్ఫూర్తి పొంది చేపట్టినదే అన్నారు రాహుల్‌గాంధీ. అప్పడు ఎండ, వాన ఏదీ వచ్చిన వైఎస్సార్‌ పాదయాత్రను కొనసాగించారని రాహుల్‌గాంధీ గుర్తు చేశారు. మరోవైపు ఏపీలో వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన జయంతి సందర్భంగా మాజీ సీఎం జగన్, ఆయన తల్లి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

Next Story