కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎమోషనల్‌ పోస్టు

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  26 May 2024 10:27 AM IST
congress, Rahul Gandhi, emotional tweet ,

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎమోషనల్‌ పోస్టు

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. టీఆర్‌పీ గేమ్‌ జోన్‌లో మంటలు చెలరేగి దాదాపు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. అంతేకాదు.. అదే శనివారం రాత్రి ఢిల్లీలోని వివేక్‌ విఆర్‌ న్యూబోర్న్‌ బేబీ కేర్‌ ఆస్పత్రిలో కూడా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు నవజాత శివువులు ప్రాణాలు కోల్పోయారు.

వరుసగా జరిగిన అగ్నిప్రమాద ఘటనల్లో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. రెండూ కూడా అగ్ని ప్రమాదాలే కావడం కొంత కలవరపాటుకి గురి చేసింది. ఈ క్రమంలోనే ఈ రెండు ప్రమాద సంఘటనలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎమోషనల్‌ ట్వీట్ చేశారు. గుజరాత్లోని రాజ్‌కోట్‌లో గేమింగ్‌ జోన్‌లో ఫైర్‌ యాక్సిడెంట్‌లో అమాయక చిన్నారులు సహా పలువురు చనిపోయారనే వార్త చాలా బాధాకరమని రాహుల్‌ పేర్కొన్నారు. అదే విధంగా ఢిల్లీలో బేబీ కేర్‌ ఆస్పత్రిలో జరిగిన ఘటన అగ్నిప్రమాదంలో నవజాత శిశువులు మరణించడం తీవ్రంగా కలచివేసిందని ఎక్స్‌ వేదికగా రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ మృతుల కుటుంబాలు అందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ఆ భగవంతుడు మనోదైర్యాన్ని ఇవ్వాలని కోరుకున్నారు. ఇక ఆయా అగ్ని ప్రమాద సంఘటనల్లో అన్ని విధాలా సహాయ, సహకారాలు అందించాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. గుజరాత్, ఢిల్లీ ప్రభుత్వాలు ఆయా సంఘటనలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు ను జరిపించాలన్నారు. ఆ తర్వాత దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే.. రాష్ట్ర ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని రాహుల్‌గాంధీ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

Next Story