ఏది వదులుకోవాలి.. డైలమాలో ఉన్నా: రాహుల్‌గాంధీ
రాహుల్‌గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసి.. రెండింటిలోనూ విజయం సాధించారు.
By Srikanth Gundamalla Published on 12 Jun 2024 7:15 PM ISTఏది వదులుకోవాలి.. డైలమాలో ఉన్నా: రాహుల్‌గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసి.. రెండింటిలోనూ విజయం సాధించారు. ఈ క్రమంలోనే ఆయన ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉండగా.. డైలమాలో ఉన్నట్లు చెప్పారు. యూపీలోని రాయ్‌బరేలీతో పాటు.. కేరళలోని వయనాడ్ నుంచి కూడా రాహుల్‌గాంధీ ఎంపీగా విజయాన్ని అందుకున్నారు. తాజాగా బుధవారం కేరళలోని మలప్పురంలో నిర్వహించిన ర్యాలీలో రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా తనని వరుసగా రెండోసారి ఎంపీగా గెలిపించినందుకు ధన్యవాదాలు చెప్పారు.
రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక దానికి రాజీనామా చేయాల్సి ఉందని రాహుల్ గాంధీ చెప్పారు. కానీ.. తనకు రెండు నియోజకవర్గాల్లో సంతోషంగా ఉన్నట్లు చెప్పారు.దాంతో.. ఈ స్థానాన్ని వదులకోవాలో అర్థం కావట్లేదన్నారు. ఒక విధమైన డైలమాలో ఉన్నానని రాహుల్‌గాందీ చెప్పారు. ఏ నిర్ణయం తీసుకున్నా త్వరోలనే మీరు చూడబోతున్నారని వయనాడ్ ప్రజలకు రాహుల్ గాంధీ చెప్పారు.
ఇక రాహుల్‌గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపైనా ఈ సందర్భంగా విమర్శలు చేశారు. పరమాత్ముని దయతో పారిశ్రామిక వేత్తలు అదానీ, అంబానీలకు అనుకూలంగా పనిచేస్తారంటూ మండిపడ్డారు. కానీ తాను సామాన్య మానవుడని అని చెప్పారు. చాలా సాధారణంగా ఉంటానన్నారు. దేశంలో ఉన్న పేదలే తనకు దేవుళ్లనీ అన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ప్రదాని నరేంద్ర మోదీ దృక్పథంలో మార్పు వచ్చిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పారు.