కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖాలిక్ ను నెటిజన్లు భారీగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అసోంలోని బార్ పేట్ లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈయన.. అర్జెంటీనా జట్టు 4-2 తేడాతో పెనాల్టీ షూటవుట్ లో ఫ్రాన్స్ ను ఓడించి ఫిఫా వరల్డ్ కప్ ను గెలిచిన తర్వాత ఓ ట్వీట్ చేశారు. మెస్సీని అభినందిస్తూ, నువ్వు అసోంతో సంబంధం కలిగి ఉన్నందుకు గర్విస్తున్నామని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. దాంతో నెటిజన్లు నివ్వెరపోయారు. మెస్సీకి అసోంతో కనెక్షన్ ఉందా? అంటూ ట్వీట్ చేయగా.. అవును, మెస్సీ అసోంలోనే పుట్టాడు అంటూ ఎంపీ బదులిచ్చారు. దీంతో కొద్ది సమయంలోనే ఈ ట్వీట్లు వైరల్ అయ్యాయి. నెటిజన్లు కాంగ్రెస్ ఎంపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో ఎంపీ తన ట్వీట్లను తొలగించారు.
అబ్దుల్ ఖాలిక్ ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా విశ్వ విజేతగా నిలిచిన తరుణంలో మెస్సీని అభినందించారు. అస్సాంతో నువ్వు (మెస్సీ) కనెక్షన్ కలిగి ఉండటంతో, మేము గర్వంగా భావిస్తున్నామంటూ ట్వీట్ చేశారు. ఆయన ఇలా ట్వీట్ చేయడమే ఆలస్యం.. అది క్షణాల్లోనే వైరల్ అయ్యింది. దీంతో ఆయనపై భారీగా ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. తమదైన శైలిలో ఆయనపై సెటైర్లు వేస్తూ ఆటాడుకుంటున్నారు.