డిప్యూటీ సీఎంగా నవజ్యోత్ సింగ్ సిద్దూ?

Congress may appoint sulking Navjot Singh Sidhu Punjab deputy chief minister. తాజాగా నవజ్యోత్ సింగ్ సిద్దూకు పంజాబ్ డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ లభించనుంది.

By Medi Samrat
Published on : 17 March 2021 1:32 PM IST

sulking Navjot Singh Sidhu

స్టార్ క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకున్న నవజ్యోత్ సింగ్ సిద్దూ తర్వాత బుల్లితెరపై తన సత్తా చాటుతూ వచ్చారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ప్రతిసారి ఏదో ఒక కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. తాజాగా నవజ్యోత్ సింగ్ సిద్దూకు పంజాబ్ డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ లభించనుంది. పంజాబ్ రాష్ట్ర సీఎం అమ‌రీంద్ సింగ్ ఈ అంశంలో ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్న‌ట్లు తెలుస్తోంది. 2022లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని.. న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూకు డిప్యూటీ సీఎం ప‌ద‌విని క‌ట్ట‌బెట్టాల‌ని అమ‌రీందర్ ఆలోచిస్తున్నారు.

గత కొంత కాలంగా సీఎం అమ‌రీంద్ సింగ్, సిద్దూ మధ్య విభేదాలు తార స్థాయికి చేరుకోవడంతో జూలై 2019 న కేబినెట్ నుంచి వైదొలిగారు. ఆ తర్వాత కేబినెట్‌లో చేరాల్సిందిగా, విద్యుత్ శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని సీఎం అమరీందర్ సింగ్ పలుమార్లు విజ్ఞప్తి కూడా చేశారు. కానీ సిద్దూ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. అంతే కాదు ఆ సమయంలో తనకు డిప్యూటీ సీఎం పదవి తో పాటు పీసీసీ పదవి కూడా కావాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు సిద్దూకు డిప్యూటీ సీఎం పోస్టు ఇవ్వాల‌ని అమ‌రీంద‌ర్ భావిస్తున్న‌ట్లు కొన్ని వ‌ర్గాల ద్వారా స్ప‌ష్ట‌మైంది. పంజాబ్ ఎన్నిక‌ల్లో సిద్దూ కీల‌క ప్ర‌చార‌కర్త‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశాలు ఉన్నాయి. ఎన్నికల నాటికి వారిద్దరూ ఒకేతాటిపై నడవాలన్న ధ్యేయంతో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హరీశ్ రావత్‌ను పంజాబ్ వీరిద్దరి మధ్య సఖ్యత కుదుర్చే బాధ్యతను ఆయన భుజ స్కంధాలపై మోపింది. ఈ క్రమంలోనే సిద్దూకు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టనున్నట్లు సమాచారం.




Next Story