గ్యాంగ్‌స్టర్ అతిక్‌కు భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ నాయకుడి డిమాండ్
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ సమాధిపై త్రివర్ణ పతాకాన్ని ఉంచినందుకు
By అంజి Published on 20 April 2023 9:32 AM ISTగ్యాంగ్‌స్టర్ అతిక్‌కు భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ నాయకుడి డిమాండ్
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ సమాధిపై త్రివర్ణ పతాకాన్ని ఉంచినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజ్‌కుమార్ సింగ్ 'రజ్జూ'ని బుధవారం ఆరేళ్లపాటు సస్పెండ్ చేశారు. వైరల్ వీడియోలో.. రజ్జు అతిక్ అహ్మద్‌ను "అమరవీరుడు" అని పిలవడం, ఇటీవల కాల్చి చంపబడిన గ్యాంగ్‌స్టర్-రాజకీయవేత్తకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో రజ్జును ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రయాగ్‌రాజ్ కాంగ్రెస్ కమిటీ ఒక లేఖను విడుదల చేసింది.
ఆ లేఖలో.. ఆజాద్ స్క్వేర్ వార్డ్ నంబర్ 43 నుండి కాంగ్రెస్ అభ్యర్థి రాజ్‌కుమార్ సింగ్ 'రజ్జు' బహిష్కరించబడ్డారు. అతిక్ అహ్మద్ గురించి ఆయన చేసిన ప్రకటన ఆయన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. అతని అభ్యర్థిత్వం రద్దు చేయబడింది. వీడియో వైరల్ కావడంతో, ప్రయాగ్‌రాజ్ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
అతిక్ అహ్మద్, సోదరుడు అష్రాఫ్ కాల్చి చంపబడ్డారు
ఏప్రిల్ 15న ప్రయాగ్‌రాజ్‌లో అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌లను ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. ప్రయాగ్‌రాజ్‌లో వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తున్న ఎంఎల్‌ఎన్ మెడికల్ కాలేజీ ప్రాంగణానికి సమీపంలో కాల్పులు జరిగాయి. వారిద్దరినీ కసరి మసారి శ్మశాన వాటికలో ఖననం చేశారు. ముగ్గురు షూటర్లను లవ్లేష్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్యగా గుర్తించి యూపీ పోలీసులు పట్టుకున్నారు.