నిరుద్యోగం పెరుగుతోంది.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్‌

Congress leader Rahul Gandhi attacks Centre over unemployment. నిరుద్యోగం, నల్లధనం గురించి ఆయన తన ఎన్నికల ప్రసంగాల్లో మాట్లాడరని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ సోమవారం ప్రధాని

By అంజి  Published on  14 Feb 2022 4:20 PM IST
నిరుద్యోగం పెరుగుతోంది.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్‌

నిరుద్యోగం, నల్లధనం గురించి ఆయన తన ఎన్నికల ప్రసంగాల్లో మాట్లాడరని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకున్నారు. పంజాబ్‌ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన గాంధీ, నోట్ల రద్దు మరియు వస్తు సేవల పన్నుపై నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. కేవలం ఇద్దరు, ముగ్గురు బిలియనీర్లు మాత్రమే వారి నుండి లబ్ధి పొందారని ఆరోపించారు. తన పార్టీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ పేదరికాన్ని అర్థం చేసుకున్నారని పేర్కొన్న రాహుల్‌ గాంధీ, చన్నీ పేద ప్రజలు, రైతులు, చిన్న వ్యాపారులు, చిన్న, మధ్యతరహా వ్యాపారాల ప్రభుత్వాన్ని నడిపిస్తారని అన్నారు. "మన ముందు పంజాబ్ ఎన్నికలు ఉన్నాయి. ఇది మామూలు ఎన్నికలు కాదు. మీరు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి" అని రాహుల్‌ గాంధీ ప్రజలతో అన్నారు.

నేడు దేశంలో, ప్రతి రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతోందని రాహుల్‌ గాంధీ అన్నారు. నోట్ల రద్దు సమయంలో మోదీ ప్రభుత్వం నల్లధనంపై పోరాటమని చెప్పిందని, అయితే ఆ డబ్బును చిన్న వ్యాపారులు, రైతుల జేబుల్లోంచి తీసి ఇద్దరు ముగ్గురు 'బిలినీయర్లకు' ఇచ్చారని అన్నారు. 15 లక్షలను బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తానని మోదీ చెప్పేవారు. "యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఆయన చెప్పారు" అని గాంధీ అన్నారు. నరేంద్ర మోడీ ఉపాధి గురించి ఎందుకు మాట్లాడరు, నల్లధనం గురించి ఈ రోజుల్లో ఎందుకు మాట్లాడరు అని ఆయన ప్రశ్నించారు.

రాహుల్‌ గాంధీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీని ఎదుర్కొంటూ, "ఆప్ పంజాబ్‌ను అర్థం చేసుకోదు. రాష్ట్రాన్ని పట్టించుకోదు. కాంగ్రెస్ మాత్రమే పంజాబ్‌ను అర్థం చేసుకుంటుంది. దానిని ముందుకు తీసుకెళ్లగలదు. రాహుల్‌ గాంధీ ఇంకా మాట్లాడుతూ.. "మా ప్రభుత్వం ఇద్దరు లేదా ముగ్గురు బిలియనీర్లది కాదు. మన ప్రభుత్వం ఇద్దరు ముగ్గురు బిలియనీర్ల పాలనలో ఉంటే, పంజాబ్‌లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిలబడేది కాదు. మా ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉంది అందుకే మేము రైతులకు అండగా నిలిచాం అన్నారు.

Next Story