బ్రేకింగ్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ కన్నుమూత

Congress leader Ahmed patel dies .. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్‌పటేల్‌ (71) కన్నుమూశారు. నెల రోజుల

By సుభాష్  Published on  25 Nov 2020 12:50 AM GMT
బ్రేకింగ్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ కన్నుమూత

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్‌పటేల్‌ (71) కన్నుమూశారు. నెల రోజుల కిందట కరోనా బారిన పడిన ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు ఫైజర్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. అయితే అహ్మద్‌పటేల్‌కు కరోనా సోకడంతో పలు అవయవాలు తీవ్రంగా దెబ్బ తినడంతో ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించారు. అహ్మద్‌ పటేల్‌ అక్టోబర్‌ 1న కరోనా బారిన పడ్డారు. అనంతరం నవంబర్‌ 15న ఆస్పత్రిలో చేరారు. కొన్ని రోజులు ఐసీయూలో చికిత్స పొందారు.

కాగా, గుజరాత్‌కు చెందిన అహ్మద్‌పటేల్‌ కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతనే కాకుండా సోనియాగాంధీకి వ్యక్తిగత సలహాదారుగా, అత్యంత నమ్మకస్థుడైన నేతగా మెలిగారు. కరోనాతో ఆస్పత్రికి పరిమితమైన ఆయన.. ఇటీవల గుజరాత్‌ ఉప ఎన్నికలు, బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాల్లో దూరంగా ఉండిపోయారు. అహ్మద్‌పటేల్‌ పూర్తి పేరు అహ్మద్బాయ్‌ మొహమ్మద్బా పటేల్‌. గుజరాత్‌ నుంచి 8 సార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. లోక్‌సభకు మూడుసార్లు, రాజ్యసభకు ఐదు సార్లు ప్రాతినిధ్యం వహించారు. 2017 ఆగస్టు 9న అహహ్మద్‌పటేల్‌ ఐదోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2018 ఆగస్టు 21న కాంగ్రెస్‌ అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ కోశాధికారిగా నియమితులయ్యారు. అహ్మద్‌పటేల్‌ మృతిపై పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంచి నేతను కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. రాజకీయల్లో మంచి నేతగా ఎదిగిన పటేల్‌.. ఎన్నో సేవలందించారన్నారు. పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారన్నారు.ముద్ర వేశారన్నారు.

పార్టీకి అండగా నిలబడ్డారు: రాహుల్‌

అహ్మద్‌పటేల్‌ మృతిపై రాహుల్‌ గాంధీ విచారం వ్యక్తం చేశారు. ఈ రోజు అహ్మద్‌పటేల్‌ మన మధ్య లేకపోవడం బాధాకరం. పటేల్‌ కాంగ్రెస్‌ పార్టీకి మూల స్తంభంగా నిలబడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ కష్టసుఖాల్లో ఆయన పాలుపంచుకున్నారు. పార్టీకి ఎల్లప్పుడు అండగా నిలబడ్డారు. ఒక మంచి నేతగా కోల్పోయాము. ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నాము అన్నారు.



Next Story