ఆ జిల్లాలో ఏప్రిల్ 6 నుండి పూర్తిస్థాయి లాక్‌డౌన్
Complete lockdown in Chhattisgarh's Durg from April 6 to 14. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో వారం రోజులపాటు పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ విధించనున్నారు.
By Medi Samrat Published on
2 April 2021 9:01 AM GMT

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో వారం రోజులపాటు పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ విధించనున్నారు. ఈ మేరకు దుర్గ్ జిల్లా కలెక్టర్ సర్వేశ్వర్ భూరే మాట్లాడుతూ.. జిల్లాలో కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి ఏప్రిల్ 6 నుంచి 14వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే దుర్గ్ జిల్లాలో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంది. అంతేకాక బస్తర్, మహాసముంద్, రాజ్‌నంద్‌గావ్, రాయగఢ్, రాయ్‌పూర్, కొరియా, సుక్మా జిల్లాల్లో గత మంగళవారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లో చేస్తున్నారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలుచేస్తున్నారు.
ఇదిలావుంటే.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే 4617 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,53,804కు చేరింది. ఇందులో 3,20,613 మంది కరోనా నుంచి కోలుకోగా.. 28,987 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు మహమ్మారి కారణంగా 4204 మంది మరణించారు.
Next Story