ఆయన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కాదు.. డూప్లికేట్ అంటా..!

CM kejriwal duplicate. మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని పెద్దలు చెబుతూ ఉంటారు. ఏడుగురి సంగతెమో

By అంజి  Published on  14 Oct 2021 12:02 PM GMT
ఆయన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కాదు.. డూప్లికేట్ అంటా..!

మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని పెద్దలు చెబుతూ ఉంటారు. ఏడుగురి సంగతెమో గానీ.. మనుషులను పోలిన మనుషులను చాలా సందర్భాల్లో టీవీల్లో, పేపర్లలో అప్పుడప్పుడు చూస్తుంటాం. కొందరు సెలబ్రిటీలకు ఏ మాత్రం తీసిపోని విధంగా డూప్‌లు ఉంటారు. అప్పడప్పుడు సెలబ్రిటీల లాగా ఉండే డూప్‌ల ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి అచ్చం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌లా ఉన్నాడు. అతని శరీర వైఖరితో పాటు హావభావాల్లో సైతం ఏ మాత్రం తేడా కనిపించడం లేదు. అయితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొంచెం హైట్‌ ఉంటాడు. ఇతడు కొంచెం హైట్‌ తక్కువగా ఉన్నాడు.

మధ్యప్రదేశ్‌లో రాష్ట్రంలోని గ్వాలియర్‌లో మోతీ మహల్‌ ఎదుట గుప్తా చాట్‌ పేరుతో స్టాల్‌ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి అచ్చుగుద్దినట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌లా ఉన్నాడు. అతడి స్టాల్‌లో పాపిడి, పాలక్ చాట్, సమోసా, కచోరీ, దహీవడ ఫేమస్‌ కావడంతో.. చాలా మంది ఆహార ప్రియులు అక్కడికి క్యూ కడుతు ఉంటారు. ఈ క్రమంలోనే ఆ స్టాల్‌ గురించి తెలుసుకునేందుకు కరణ్ దువా అనే ఓ ఫుడ్‌ బ్లాగర్‌ స్టాల్‌ దగ్గరికి వచ్చాడు. స్టాల్‌ నిర్వహకుడిని చూసిన కరణ్ దువా.. అతడు అచ్చం కేజ్రీవాల్‌ పోలి ఉండటంతో... చాట్‌ నిర్వహకుడిపై శ్రద్ధ పెట్టి వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశాడు. ఇక ఈ వీడియోకు యూట్యూబ్‌లో మంచి స్పందన వచ్చింది. వీడియో కింద నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

Next Story
Share it