నెట్‌ కేబుల్‌ వైర్లతో చిక్కుకున్న స్కూటర్‌.. బస్సు కిందకు దూసుకెళ్లడంతో..

చెన్నైలో గురువారం ఓ వ్యక్తి నడుపుతున్న స్కూటర్‌పై ప్రమాదవశాత్తూ కేబుల్‌ తీగలు తెగిపడ్డాయి.

By అంజి  Published on  10 May 2024 4:56 PM IST
Chennai,  Aaduthotti , Tamilnadu

నెట్‌ కేబుల్‌ వైర్లతో చిక్కుకున్న స్కూటర్‌.. బస్సు కిందకు దూసుకెళ్లడంతో..

చెన్నైలో గురువారం ఓ వ్యక్తి నడుపుతున్న స్కూటర్‌పై ప్రమాదవశాత్తూ కేబుల్‌ తీగలు తెగిపడ్డాయి. దీంతో స్కూటర్‌ అదుపు తప్పి బస్సు కిందకు దూసుకువెళ్లింది. అయితే బస్సు డ్రైవర్‌ బ్రేక్‌ వేయడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. చెన్నైలోని ఆడుతొట్టికి చెందిన అశోక్ కుమార్ అనే వ్యక్తి తన ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా కల్మండపం సమీపంలో అతని స్కూటర్ టైరు తెగిపడిన ఇంటర్నెట్ కేబుల్స్‌తో చిక్కుకుంది.

స్కూటర్ అదుపు తప్పి తమిళనాడు స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టిఎన్‌ఎస్‌టిసి) బస్సు ముందు చక్రం కిందకు వచ్చింది. బస్సు డ్రైవర్ వెంటనే బస్సును ఆపడంతో అశోక్ సురక్షితంగా బయటపడ్డాడు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఘటనకు సంబంధించిన వీడియోలో అతడి స్కూటర్ ముందు భాగం బస్సు కింద ఇరుక్కుపోయి ఉండటం కనిపించింది. అనేక తెగిపడిన కేబుల్స్ కూడా రోడ్డుపై పడి ఉన్నాయి.

Next Story