అక్రమణ నిర్మాణాలను ఎవ్వరూ ఉపేక్షించరు. అలాంటి నిర్మాణాలను కూల్చివేస్తారు. అక్రమంగా నిర్మించిన దుకాణాలను ఖాళీ చేయించడానికి వెళ్లిన పోలీసులపై వ్యాపారులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ పోలీస్ అధికారిణి చేతి వేళ్లు తెగిపోయాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని ఠాణెలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. రాణె మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పుట్‌పాత్‌లపై వీధి వ్యాపారులు అక్రమంగా దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ దుకాణాలను ఖాళీ చేయించాలని థానే మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. మున్సిపల్ కమిషనర్ డాక్టర్ విపిన్ శర్మ ఆదేశాలతో పోలీసులతో కలిసి సిబ్బంది దుకాణాలు ఖాళీ చేయించేందుకు చర్యలు చేపట్టారు. సోమవారం సాయంత్రం ఘోడ్‌బందర్ రోడ్డు దుకాణాలను ఖాళీ చేయించేందుకు అధికారులు యత్నించగా.. ఘర్షణ తలెత్తింది.
ఈ క్రమంలో కూరగాయల వ్యాపారి అమర్జీత్ యాదవ్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కల్పితా పింపుల్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో కల్పితా పింపుల్ మూడు చేతి వేళ్లు తెగిపడడంతో పాటు ఆమె తలకు కూడా తీవ్రగాయం అయ్యింది. వెంటనే అధికారులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఏసీపీతో పాటు సెక్యూరిటీ గార్డుకు గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అమర్జీత్‌ను అరెస్టు చేశారు. అతడిపై హత్యాయత్నం, ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించాడన్న అభియోగం కింద కేసులు నమోదు చేశారు.