న్యూఢిల్లీ: అరుదైన హిమాలయన్ హెర్బ్ 'కీడా జాడి' (కార్డిసెప్స్)ను సేకరించేందుకు భారత భూభాగంలోకి చైనా చొరబాటు అనేక ప్రయత్నాలు జరిగాయని ఇండో-పసిఫిక్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ (IPCSC) తెలిపింది. కార్డిసెప్స్, గొంగళి పురుగు ఫంగస్ లేదా హిమాలయన్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. ఇది చైనాలో ఖరీదైన మూలికా ఔషధం. ప్రధానంగా భారతీయ హిమాలయాల్లో, నైరుతి చైనాలోని పీఠభూమి ఎత్తైన ప్రాంతంలో కనిపించే ఫంగస్ కోసం చైనా సైనికులు అరుణాచల్ ప్రదేశ్‌లోకి అక్రమంగా ప్రవేశించారని ఐపీసీఎస్‌సీ నివేదిక ఆరోపించింది.
ప్రపంచవ్యాప్తంగా 2022లో కార్డిసెప్స్ మార్కెట్ విలువ 1,072.50 మిలియన్ల డాలర్లు. చైనా దీని అతిపెద్ద ఉత్పత్తిదారు, ఎగుమతిదారు కూడా. ఐపీసీఎస్‌సీ ప్రకారం, గత కొన్ని సంవత్సరాలుగా చైనాలో కార్డిసెప్స్ పంట తగ్గిపోయింది. దీని ఫలితంగా ఈ ఔషధ ఫంగస్ కొరత ఏర్పడింది. ఇది గోధుమ రంగులో ఉంటుంది. రెండు అంగుళాల పొడవు ఉంటుంది. ఇది హిమాలయ ప్రాంతాలలో మూడు నుండి ఐదు వేల మీటర్ల ఎత్తులో కనిపిస్తుంది. భారతదేశంలో దీనిని 'కిడా జాడి' అని పిలుస్తారు. నేపాల్, చైనాలో దీనిని 'యర్సగుంబా' అని పిలుస్తారు. టిబెట్‌లో దీని పేరు 'యర్సాగంబు'.
Cordyceps శాస్త్రీయ నామం 'Ophiocordyceps sinensis' అయితే, ఆంగ్లంలో దీనిని 'caterpillar fungus' అంటారు. కిలో 'గొంగళి పురుగు ఫంగస్' విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.10-12 లక్షల వరకు ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ పెరగడంతో చైనా సైనికులు ఈ ఫంగస్ కోసం బార్డర్ దాటి అరుణాచల్ ప్రదేశ్‌లోకి చొరబడినట్లు ఐపీసీఎస్‌సీ నివేదిక పేర్కొంది.