జ‌న‌వ‌రి 1 నుంచి 15-18 ఏళ్ల వారికి టీకా రిజిస్ట్రేష‌న్లు..

Children aged 15-18 years can register for vaccination from January 1.ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చిన్నారుల టీకా పంపిణీపై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Dec 2021 8:04 AM GMT
జ‌న‌వ‌రి 1 నుంచి 15-18 ఏళ్ల వారికి టీకా రిజిస్ట్రేష‌న్లు..

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చిన్నారుల టీకా పంపిణీపై రెండు రోజుల క్రితం కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 3వ తేదీ నుంచి దేశంలో 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌యసు ఉన్న వారికి టీకాల‌ను వేయ‌నున్న‌ట్లు చెప్పారు. ఈ నేప‌థ్యంలో వారు ఎలా టీకా పొందాలనే విష‌యాల‌ను కేంద్రం సోమ‌వారం వెల్ల‌డించింది. జ‌న‌వ‌రి 1 తేదీ నుంచి 15 నుంచి 18 ఏళ్ల వారి కోసం కొవిన్ యాప్‌, వైబ్‌సైట్‌లో రిజిస్టేష‌న్లు చేసుకునే వెసులుబాటు క‌ల్పిస్తున్నట్లు కొవిన్ ఫ్లాట్‌ఫామ్ చీఫ్ డా. ఆర్ఎస్ శ‌ర్మ తెలిపారు. ఆధార్ కార్డు లేదా ఇత‌ర గుర్తింపు ఐడీ ఉప‌యోగించుకుని రిజిస్ట్రేష‌న్లు చేసుకోవ‌చ్చున‌ని చెప్పారు. అయితే.. అంద‌రి వ‌ద్ద ఆధార్ ఉండ‌క‌పోవ‌చ్చున‌ని అలాంటి వారు స్టూడెంట్ ఐడీ కార్డుల‌తోనూ రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చున‌ని తెలిపారు.

'జనవరి 1 నుండి 15-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలు CoWIN యాప్‌లో నమోదు చేసుకోగలరు. రిజిస్ట్రేషన్ కోసం మేము అదనంగా (10వ) ID కార్డ్‌ని జోడించాము. కొంతమందికి ఆధార్ లేదా ఇతరాలు ఉండకపోవచ్చు కాబట్టి విద్యార్థి ID కార్డ్ గుర్తింపు కార్డులు ఉప‌యోగించుకోవ‌చ్చు. వీరంద‌రికి జ‌న‌వ‌రి మూడో తేదీ నుంచి టీకా పంపిణీ ప్రారంభం కానుంది.' అని శర్మ చెప్పారు.

ప్రాథమిక నివేదికల ప్రకారం.. CoWIN యాప్‌లో పిల్లల నమోదు ప్లాట్‌ఫారమ్‌లో పెద్దల నమోదుకు దాదాపు సమానంగా ఉంటుంది. 15-18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు CoWIN యాప్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోగలరు లేదా ఏదైనా టీకా కేంద్రానికి వెళ్లి అవసరమైన సహాయక పత్రాలను అందించిన‌ తర్వాత టీకాలు వేయగలరు.

ఫ్రికాష‌న్ డోసు కోసం..

కొవిన్‌ ప్లాట్‌ఫారమ్‌లో 60 ఏళ్లు పైబడిన వారిని ఫ్రికాష‌న్ డోసు కోసం ఎలా నమోదు చేయాలి అనే ప్రశ్నకు శర్మ సమాధానమిస్తూ.. 60 ఏళ్లు పైబడిన పౌరులు ఫ్రికాష‌న్ డోసు కోసం నమోదు చేసే ప్రక్రియ సరిగ్గా అదే విధంగా ఉంటుందని చెప్పారు. "మీ వయస్సు 60 ఏళ్లు పైబడి ఉండి, రెండు డోస్‌లు తీసుకుని ఉండాలి. అలాగే.. రెండో డోస్ తీసుకున్న త‌రువాత 9 నెలల కంటే ఎక్కువ (39 వారాలు) గ్యాప్ ఉంటే, అప్పుడు మీరు అర్హులు" అని చెప్పారు.

అయితే.. ఈ ఫ్రికాష‌న్ డోసు తీసుకునేందుకు అంద‌రూ అర్హులు కారు. ప్ర‌స్తుతానికి ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్లు. 60 ఏళ్ల దాటి ఇత‌ర‌త్రా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌వారికి ఈ డోసును అందించ‌నున్నారు.

Next Story