కదులుతున్న రైలు నుంచి కింద పడ్డ చిన్నారి.. కాపాడుదామని దూకిన తండ్రి.. ఇద్దరూ మృతి

Child falls off train, father jumps out to save her.. both die. ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన జరిగింది. కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తూ మూడేళ్ల బాలిక

By అంజి
Published on : 14 Nov 2022 10:04 AM IST

కదులుతున్న రైలు నుంచి కింద పడ్డ చిన్నారి.. కాపాడుదామని దూకిన తండ్రి.. ఇద్దరూ మృతి

ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన జరిగింది. కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తూ మూడేళ్ల బాలిక కింద పడిపోయింది. దీంతో చిన్నారిని రక్షించేందుకు ఆమె తండ్రి రైలు నుంచి బయటకు దూకాడు. ఆదివారం మిర్జామురాద్ పోలీస్ సర్కిల్ పరిధిలోని బహెడా హాల్ట్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరూ మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రిపోర్ట్‌ ప్రకారం.. 32 ఏళ్ల హీరా రైన్ తన భార్య జరీనా, కుమార్తె, బావ ఫిరోజ్‌తో కలిసి ఢిల్లీ నుండి బీహార్‌కు ప్రయాణిస్తున్నాడు.

రైలులో కిక్కిరిసిపోయి సీట్లు దొరక్క కుటుంబసభ్యులు డోర్ దగ్గర కూర్చున్నారు. చిన్నారి రైలు నుండి పడిపోయినప్పుడు, ఆమెను రక్షించడానికి హీరా రైన్‌ వెంటనే బయటకు దూకాడు. అతని భార్య వెంటనే రైలును ఆపడానికి అత్యవసర గొలుసును లాగింది. మరికొందరు ప్రయాణికులు వచ్చి సహాయం చేయగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు గుర్తించారు. తండ్రిని ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, స్థానిక బంధువులకు సమాచారం అందించామని ఇన్‌స్పెక్టర్‌ మీర్జామురాద్‌, రాజీవ్‌సింగ్‌ తెలిపారు.

Next Story