హృదయవిదారకం.. కుమారై మృత‌దేహాన్ని భుజాలపై 10కి.మీ మోసుకెళ్లిన తండ్రి.. వీడియో

Chhattisgarh man carries Daughter's body for 10 km.ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో హృదయవిదారక సంఘటన జరిగింది. అనారోగ్యంతో మృతిచెందిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 March 2022 10:34 AM IST
హృదయవిదారకం.. కుమారై మృత‌దేహాన్ని భుజాలపై 10కి.మీ మోసుకెళ్లిన తండ్రి.. వీడియో

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో హృదయవిదారక సంఘటన జరిగింది. అనారోగ్యంతో మృతిచెందిన కుమారైను ఆస్ప‌త్రి నుంచి ఇంటికి తీసుకువెళ్లేందుకు వాహ‌నాలు అందుబాటులో లేక‌పోవ‌డంతో త‌న భుజాలపైనే మోసుకెళ్లాడు ఓ తండ్రి. ఇలా కుమారై మృతదేహాన్ని భుజంపై వేసుకుని 10 కిలో మీట‌ర్ల వ‌ర‌కు న‌డుకుంటూ తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

వివ‌రాల్లోకి వెళితే.. అమ్‌దాలా గ్రామంలో ఈశ్వ‌ర్‌దాస్ త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. ఆయ‌న కుమారై సురేఖ‌(7) గ‌త నాలుగు రోజుల నుంచి తీవ్ర‌మైన జ్వ‌రంతో బాధ‌ప‌డుతోంది. దీంతో బాలిక‌ను చికిత్స నిమిత్తం ల‌ఖాన్‌పూర్ క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్‌కు శుక్ర‌వారం ఉద‌యం తీసుకొచ్చారు. బాలిక ప‌రిస్థితి విష‌మించ‌డంతో మృతి చెందింది. బాలిక మృత‌దేహాన్ని తీసుకువెళ్లేందుకు వాహ‌నాలు అందుబాటులో లేక‌పోవ‌డంతో చేసేదీ ఏమీ లేక.. ఈశ్వ‌ర్‌దాస్ త‌న కుమారై మృత‌దేహాన్ని భుజాల‌పై వేసుకుని దాదాపు 10 కిలోమీట‌ర్ల దూరంలోని గ్రామానికి తీసుకువెళ్లారు.

దీనిపై మెడిక‌ల్ అసిస్టెంట్ డాక్ట‌ర్ వినోద్ భార్గ‌వ్ మాట్లాడుతూ.. సురేఖ‌ను ఆస్ప‌త్రికి తీసుకువ‌చ్చిన అనంత‌రం ప‌రీక్షించామ‌ని.. అప్ప‌టికే బాలిక ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ పూర్తిగా ప‌డిపోయాయ‌న్నారు. ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో శుక్ర‌వారం ఉద‌యం 7.30గంట‌ల‌కు బాలిక మృతి చెందింది. మృత‌దేహాన్ని త‌ర‌లించే వాహ‌నం త్వ‌ర‌గానే వ‌స్తుంద‌ని చెప్పాం. వాహ‌నం 9.20కి వ‌చ్చింది. అయితే.. అప్ప‌టికే వారు మృత‌దేహాంతో వెళ్లిపోయార‌ని అన్నారు.

విచార‌ణ‌కు ఆదేశించిన ఆరోగ్య శాఖ మంత్రి

ఈశ్వ‌ర్ దాస్ త‌న కుమారై మృత‌దేహాన్ని భుజాల‌పై మోసుకెళ్లిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ ఘ‌ట‌న‌పై ఆరోగ్య శాఖ మంత్రి సింగ్ దియో తీవ్రంగా మండిప‌డ్డారు. బిడ్డ‌ను మోసుకెళ్తున్న వీడియోను చూసి చ‌లించిపోయాన‌ని మంత్రి చెప్పారు. ఈ ఘ‌ట‌న‌కు బాధ్యులైన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆరోగ్య శాఖ ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించిన‌ట్లు చెప్పారు.

Next Story