కొరడాతో కొట్టించుకున్న సీఎం.. ఎందుకంటే..?

Chhattisgarh Chief Minister Bhupesh Baghel Whipped In A Ritual.ఛ‌త్తీస్​గఢ్ సీఎం భూపేశ్​ బఘేల్ కొరడాతో కొట్టించుకున్నారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Nov 2021 2:44 PM IST
కొరడాతో కొట్టించుకున్న సీఎం.. ఎందుకంటే..?

ఛ‌త్తీస్​గఢ్ సీఎం భూపేశ్​ బఘేల్ కొరడాతో కొట్టించుకున్నారు. అదేంటి..? ముఖ్య‌మంత్రి ఏదైన త‌ప్పు చేసి కొర‌డాతో కొట్టించుకున్నారా..? లేక స‌ర‌దాగా కొట్టించుకున్నారా..? అని సందేహా ప‌డ‌కండి. ఆయన కొరడాతో కొట్టించుకోవడానికి ఉన్న కారణం సంప్రదాయాలను పాటించడమే. అవును ఓ ఆల‌యంలో జ‌రిగిన పూజా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సీఎం అక్క‌డి ఆచారం ప్ర‌కారం ఇలా కొర‌డాతో కొట్టించుకున్నారు.

వివ‌రాల్లోకి వెళితే.. ఛ‌త్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ్‌లో ప్రతి సంవ‌త్స‌రం గోవర్ధన్ పూజ నిర్వహిస్తారు. ఆ త‌ర్వాత భ‌క్తులు కొరడాతో కొట్టించుకుంటారు. ఇలా గోవ‌ర్ధ‌న్ పూజ అనంత‌రం.. అమ్మవారి ఎదుట పూజారీ చేత్తో కొరడా దెబ్బలు తింటే మంచిదని స్థానికుల నమ్మకం. కొర‌డా దెబ్బ‌లు తిన‌డం వ‌ల్ల స‌మ‌స్య‌లు తీరిపోతాయ‌ని విశ్వాసం.

విషయం తెలిసిన సీఎం కూడా కొరడా దెబ్బలు తినేందుకు సిద్ధమయ్యారు. తన కుడిచేతి చొక్కాను కొంచెం పైకి లాగారు. అనంతరం పూజారి ముఖ్యమంత్రి చేతిపై కొరడా దెబ్బలను కొట్టారు. మొత్తం ఎనిమిది కొర‌డా దెబ్బ‌లు తిన్నారు. కొర‌డా దెబ్బ‌లు తింటున్న స‌మ‌యంలో సీఎం భూపేష్ సంతోషంగానే క‌నిపించారు. సీఎం కదా.. కొంచెం మెల్లగా కొడదాం అనే భావన లేకుండా సామాన్య భ‌క్తుడిలాగానే బావించి ఆ పూజారీ కొర‌డాతో కొట్టారు. ఇక వెళ్లిపోయే ముందు సీఎం ఆ పూజారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.

Next Story