7న సెలవు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం.. ఎల్జీ లేఖ‌కు సీఎం గ్రీన్ సిగ్నల్..!

ఛత్ పండుగ సందర్భంగా నవంబర్ 7న రాజధాని ఢిల్లీలో సెలవు ఉంటుంది. సెలవుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసింది

By Kalasani Durgapraveen  Published on  5 Nov 2024 3:31 PM IST
7న సెలవు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం.. ఎల్జీ లేఖ‌కు సీఎం గ్రీన్ సిగ్నల్..!

ఛత్ పండుగ సందర్భంగా నవంబర్ 7న రాజధాని ఢిల్లీలో సెలవు ఉంటుంది. సెలవుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసింది. ఛత్ పండుగ సందర్భంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని సీఎం అతిశీ తెలిపారు. లెప్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌ ప్రతిపాదనకు సీఎం అతిషి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంత‌కుముందు ఛత్ రోజున సెలవు ఇవ్వాలని ఎల్జీ వీకే సక్సేనా సీఎం అతిషికి లేఖ రాశారు.

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నవంబర్ 7వ తేదీని ఢిల్లీలో ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని అభ్యర్థిస్తూ ముఖ్యమంత్రి అతిషికి లేఖ రాశారు. నవంబర్ 7న ఛత్ పండుగ.. దీనిని దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించే ఫైలును పంపాలని గవర్నర్ అతిషికి లేఖ రాశారు.

దీనిపై ముఖ్యమంత్రి అతిషి ట్వీట్ చేస్తూ.. నవంబరు 7న ఛత్ పండుగకు సెలవు దినంగా ప్ర‌క‌టిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించిందని.. పూర్వాంచలి సోదర సోదరీమణులందరూ ఛత్ పండుగను వైభవంగా జరుపుకునేలా ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించిందని తెలియజేసేందుకు సంతోషిస్తున్నానని రాసుకొచ్చారు.

Next Story