ప్రధాని మోదీ ముందు చెస్‌ చాంపియన్స్ గేమ్ (వీడియో)

ఇటీవల బుడాపెస్ట్‌ వేదికగా 45వ చెస్‌ ఒలింపియాడ్‌ ముగిసిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  26 Sep 2024 9:30 AM GMT
ప్రధాని మోదీ ముందు చెస్‌ చాంపియన్స్ గేమ్ (వీడియో)

ఇటీవల బుడాపెస్ట్‌ వేదికగా 45వ చెస్‌ ఒలింపియాడ్‌ ముగిసిన విషయం తెలిసిందే. ఇందులో ఓపెన్‌, మహిళల విభాగాల్లో భారత యువ చెస్ క్రీడాకారులు చారిత్రాత్మక విజయాలు అందుకున్నారు. గోల్డ్‌ మెడల్స్ సాధించిన భారత బృందం టోర్నమెంట్ తర్వాత స్వదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ని కలిశారు.

ప్రధాని నరేంద్ర మోదీతో వైశాలి, హారిక, తానియా, విదిత్‌, సచ్‌దేవ్‌, ప్రజ్ఞానంద, అర్జున్‌ ఇరిగేశి సహా స్వర్ణం గెలిచిన క్రీడాకారులు భేటీ అయ్యారు. క్రీడాకారులతో మాట్లాడిన ప్రధాని మోదీ గేమ్‌లో వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారందరినీ పేరుపేరునా ప్రత్యేకంగా అభినందించారు మోదీ. ప్రధాని సమక్షంలో ప్రజ్ఞానంద్‌, అర్జున్‌ ఓ గేమ్‌ కూడా ఆడారు. వారు గేమ్‌ ఆడుతుంటే ప్రధాని ఇంట్రెస్ట్‌గా చూశౄరు. ఆ తర్వాత క్రీడాకారులు ప్రధాని నరేంద్ర మోదీకి చెస్‌ బోర్డును గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోని మోదీ ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా అవుతోంది.

మరోవైపు స్వర్ణాలు గెలిచిన భారత బృందానికి ఆలిండియా చెస్‌ సమాఖ్య రూ.3.2 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. ఆటగాళ్లకు రూ. 25 లక్షలు, పురుషుల, మహిళల జట్టు కోచ్‌లు అయిన అభిజిత్‌ కుంటె, శ్రీనాథ్‌ నారాయణన్‌కు తలా రూ.15 లక్షలు పంచనున్నారు. అలాగే భారత బృందానికి చీఫ్‌గా వ్యవహరించిన దివ్యేందు బరువకు రూ.10 లక్షలు, అసిస్టెంట్‌ కోచ్‌లలో ఒక్కొక్కరికి రూ. 7.5 లక్షలు అందనున్నాయి.



Next Story