ప్రారంభ‌మైన‌ చార్‌ధామ్‌ యాత్ర .. నిబంధనలు ఇవే..

Chardham Yatra to Begin from Today.క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా సుదీర్ఘ‌కాలంగా నిలిపివేపిన చార్‌ధామ్ యాత్ర శ‌నివారం నుంచి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Sept 2021 11:37 AM IST
ప్రారంభ‌మైన‌ చార్‌ధామ్‌ యాత్ర .. నిబంధనలు ఇవే..

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా సుదీర్ఘ‌కాలంగా నిలిపివేపిన చార్‌ధామ్ యాత్ర శ‌నివారం నుంచి ప్రారంభం అయ్యింది. చార్‌ధామ్ యాత్రపై ఉన్న నిషేదాన్ని నైనిటాల్ హైకోర్టు ఎత్తివేయ‌గా.. ఉత్త‌రాఖండ్ రాష్ట్ర ప్ర‌భుత్వం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. అయితే వ్యాక్సిన్‌ తీసుకున్న, కొవిడ్ నెగిటివ్ రిపోర్టు ఉన్న‌వారిని మాత్ర‌మే ఛార్‌ధామ్ యాత్రకు అనుమ‌తి ఇస్తున్నారు. క‌రోనా కేసులు ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాక‌పోవ‌డంతో.. ఉత్తరాఖండ్​ ప్రభుత్వం కరోనా మార్గదర్శకాలు జారీ చేసింది.

హిమాలయల్లో ఉన్న గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్​, కేదార్‌నాథ్​ ఆలయాలకు వచ్చే యాత్రికుల ప‌రిమితిపై ఆంక్ష‌లు కొన‌సాగ‌నున్నాయి. కరోనా నియమాలను త‌ప్ప‌ని స‌రిగా పాటించాల‌ని స్పష్టం చేసింది. వ్యాక్సిన్​తీసుకున్నట్లు సర్టిఫికెట్‌ను సమర్పించాలని, టీకా తీసుకోని వారు ఆర్టీపీసీఆర్ నెగటివ్ రిపోర్టును చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులకు టీకాను తప్పనిసరి చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులు స్మార్ట్ సిటీ పోర్టల్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది.

కోర్టు ఆదేశాలను అనుగుణంగా.. యాత్రసాగిన‌న్ని రోజులు బద్రీనాథ్‌లో ప్రతిరోజూ 1,000 మంది, కేదార్‌నాథ్‌లో 800 మంది, గంగోత్రిలో 600 మంది, యమునోత్రిలో 400 మంది యాత్రికులను మాత్రమే అనుమతించాలని నిర్ణయం తీసుకుంది ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం.

Next Story