1800 ఉద్యోగాల కోసం 50000 మందికి పైనే.!

మంగళవారం ముంబైలోని కలీనాలో ఎయిరిండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహించిన వాక్-ఇన్ ఇంటర్వ్యూకు వేలాది మంది నిరుద్యోగులు రావడంతో గందరగోళ దృశ్యాలు కనిపించాయి

By Medi Samrat  Published on  17 July 2024 3:00 PM GMT
1800 ఉద్యోగాల కోసం 50000 మందికి పైనే.!

మంగళవారం ముంబైలోని కలీనాలో ఎయిరిండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహించిన వాక్-ఇన్ ఇంటర్వ్యూకు వేలాది మంది నిరుద్యోగులు రావడంతో గందరగోళ దృశ్యాలు కనిపించాయి. హ్యాండీమ్యాన్, యుటిలిటీ ఏజెంట్ పోస్టులకు సంబంధించి 1,800 ఖాళీల కోసం దాదాపు 50,000 మంది హాజరయ్యారు. పరిమిత ఖాళీలు ఉన్నప్పటికీ, రిక్రూట్‌మెంట్ కార్యాలయం వెలుపల భారీ సంఖ్యలో నిరుద్యోగులు వచ్చారు. పరిస్థితి అదుపు తప్పడంతో దరఖాస్తుదారులు తమ రెజ్యూమ్‌లను ఇచ్చేసి అక్కడి నుండి వెళ్లిపోవాలని నిర్వాహకులు కోరారు.

ఏవియేషన్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ గిల్డ్ జనరల్ సెక్రటరీ జార్జ్ అబ్రమ్ మాట్లాడుతూ, రిక్రూట్‌మెంట్ ప్రక్రియ విధానంలో పొరపాట్లు జరిగాయని.. ఏకంగా 50,000 మంది ఉద్యోగార్ధులు ఇంటర్వ్యూకు హాజరయ్యారని తెలిపారు. నా దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం దాదాపు 50,000 మంది వ్యక్తులు వచ్చారు. అటువంటి డ్రైవ్‌ల విషయంలో ఇంతకు ముందే మేము కంపెనీని హెచ్చరించామన్నారు. ఉద్యోగాల కోసం కిలోమీటరు మేర క్యూ కట్టారు. పోలీసులను పిలవాల్సి వచ్చిందని తెలిపారు. 1,786 హ్యాండీమ్యాన్ మరియు 16 యుటిలిటీ ఏజెంట్ల ఖాళీలు ఉన్నాయని జార్జ్ అబ్రమ్ తెలిపారు.

Next Story